భారత్ విజయలక్ష్యం 260 పరుగులు
హమిల్టన్, మార్చి 10 : ప్రపంచ కప్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఐర్లాండ్ 260 పరుగుల లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచింది. 49 ఓవర్లలో ఐర్లాండ్ 259 పరుగులు చేసింది. ఐర్లాండ్ ఆటగాళ్లు పోర్టర్‌ఫీల్డ్ 67, నీల్‌ఒబ్రియిన్ 75, స్టిర్లింగ్ 42, బాల్‌బిర్నీ 24, కుసాక్ 11 పరుగులు చేయగా, మూనీ 12 పరుగులకు నాటౌట్‌గా నిలిచారు. భారత బౌలర్లు షమీకి మూడు, అశ్విన్‌కు రెండు వికెట్లు లభించగా, ఉమేష్, మోహిత్, జడేజా, రైనాకు ఒక్కో వికెట్ దక్కాయి.