భారత్ శాశ్వత సభ్యత్వం కోసం కజకిస్తాన్ ప్రయత్నం అమోఘం
– భారత ప్రధాని మోదీ
కజకిస్థాన్,జులై7(జనంసాక్షి): ఐక్యరాజ్యసమితిలోనిభద్రతామండలిలో భారత్‌కు సభ్యత్వం కోసం కజకిస్థాన్ ప్రయత్నం మరువలేనిదని భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ కొనియాడారు. మధ్య ఆసియా పర్యటనలో భాగంగా మోదీ మంగళవారం కజకిస్థాన్ చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రఖ్యాత నజరబయేవ్ విశ్వవిద్యాలయంలో విద్యార్థులనుద్దేశించి ఆయన ప్రసంగించారు. కజకిస్థాన్ అభివృద్ధిలో కజరబయేవ్ యూనివర్శిటీ పాత్ర ఎనలేనిదన్నారు. ఈ విశ్వవిద్యాలయంలో అభ్యసించాక మరో యూనివర్శిటిని ఎంచుకోలేమన్నారు. భారత్, మధ్యఆసియా దేశాలు ఒకదానికొకటి సహకరించుకుని అభివృద్ధి దిశగా సాగుతున్నాయన్నారు. ఇంధన రంగంలో ఇరుదేశాల మధ్య పరస్పర సహకారం ఇప్పుడే ప్రారంభమైందన్నారు.
వ్యక్తిత్వంలో భాషదే కీలకపాత్ర : మోదీ
వ్యక్తిత్వ వికాసంలో భాష కీలకపాత్ర పోషిస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. మధ్య ఆసియా పర్యటనలో భాగంగా ఉజ్బెకిస్థాన్‌లోని తాష్కెంట్‌లో హిందీ విద్యార్థులు, భారతీయులతో ప్రధాని మోదీ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఉజ్బెకిస్థాన్‌లో భారతీయ భాషలు, సినిమాలు, సంగీతం ఖ్యాతి చెందాయన్నారు. 50 ఏళ్లపాటు ఉజ్బెకిస్థాన్ రేడియోలో హిందీ ప్రసారాలు జరగటం గొప్ప విషయమన్నారు. భాషను పరీక్షిస్తే… దాని హృదం చాలా విశాలంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. దేశాల మధ్య సాంస్కృతిక బంధం కూడా చాలా ముఖ్యమని వివరించారు. ఉజ్బెకిస్థాన్ పర్యటన ఫలప్రదంగా ఉందని మోదీ పేర్కొన్నారు. ఆందోళనల నుంచి స్వేచ్ఛ లభించాలంటే సంగీతం మంచి మార్గమని… మనిషి హింసామార్గం వైపు వెళ్లకుండా సంగీతం నిరోధిస్తుందన్నారు. ఉజ్బెకిస్థాన్‌లో భారతీయ భాషలు, సినిమాలు, సంగీతానికి ఖ్యాతి లభించిందని తెలిపారు. వ్యక్తిత్వ వికాసంలో భాష కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. భాష అన్ని ప్రాంతాలు, సంప్రదాయాలను కలుపుతుందన్నారు.