భారత్‌-స్విస్‌ బంధం మరింత బలోపేతం!

మనది 70ఏళ్ల మైత్రీ బంధం: లూతర్డ్‌
దిల్లీ: భారత పర్యటన నిమిత్తం దిల్లీ వచ్చిన స్విట్జర్లాండ్‌ అధ్యక్షురాలు డోరిస్‌ లూతర్డ్‌కు రాష్ట్రపతి భవన్‌ వద్ద ఘనస్వాగతం లభించింది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్రమోదీ ఆమెకు సాదర స్వాగతం పలికారు. భారత్‌లో మూడురోజుల పాటు పర్యటించనున్న లూతర్డ్‌.. రాష్ట్రపతి, ప్రధాని, విదేశాంగమంత్రితో చర్చలు జరపనున్నారు. రెండు దేశాలది 70 ఏళ్ల మైత్రీ బంధమని గుర్తు చేసిన లూతర్డ్‌.. భారత్‌, స్విస్‌ సంబంధాలు మరింత మెరుగుపపడేందుకు తన పర్యటన దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న వాణిజ్య, భాగస్వామ్య ఒప్పందాలకు తుదిరూపు లభిస్తుందని ఆమె చెప్పారు. భారత్‌లో నూతన పెట్టుబడులు, రక్షణ ఒప్పందానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ప్రధాని మోదీ చేపడుతున్న సంస్కరణలకు తాను ముగ్ధురాలైనట్లు లూతర్డ్‌ వెల్లడించారు.