భారత్‌ హైకమిషనర్‌ భార్య వెనక్కి!

2

– సిబ్బందిపై చేయి చేసుకున్న ఆరోపణలు

మెల్‌బోర్న్‌, జూన్‌ 27(జనంసాక్షి):

న్యూజిలాండ్‌లో భా రత హైకమిషనర్‌గా ఉన్న రవి థాపర్‌ను భారత ప్రభుత్వం వెనక్కి రప్పి స్తోంది. స్వదేశానికి తిరిగివచ్చి హెడ్‌ క్వార ్టర్స్‌లో విధుల్లో చేరాలని ఆదేశించింది. న్యూజి లాండ్‌లోని ఆయన అధికారిక నివాసంలో వంట సిబ్బందిగా ఉన్న ఒక వ్యక్తిపై రవి థాపర్‌ భార్య షర్మిలా థాపర్‌ చెయ్యి చేసుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. కాగా, బాధిత వ్యక్తి అధికారికంగా ఫిర్యాదు ఇవ్వనప్పటికీ భారత విదేశీ వ్యవ హా రాలు – వాణిజ్య మంత్రిత్వశాఖ దర్యాప్తు చే స్తుందని ఈ శాఖ అధికార ప్రతినిధి వికాస్‌ స్వ రూప్‌ తెలిపారు.ఈ పరిణామం గత మే నెల రెండవ వారంలో చోటు చేసుకోగా బాధిత వ్యక్తి ఒకనాటి రాత్రి వెల్లింగ్టన్‌లోని హైకమిష నర్‌ నివాసం నుంచి 20 కిలోవిూటర్ల దూరం నడుచుకుంటూ వెళ్లాడని, అతను మానసికంగా కుంగిపోయిన స్థితిలో కనిపించాడని చెబుతు న్నారు. అతనిని తొలుత పోలీస్‌ స్టేషన్‌కు తీ సుకెళ్లి, ఆ తర్వాత వెల్లింగ్టన్‌లోని నైట్‌ షెల్టర్‌కు తరలించారని సమాచారం. అనంతరం మే చివరి వారంలో ఇతను స్వదేశానికి తిరిగి వచ్చాడు. రవి థాపర్‌ ఇంట్లో తనతో వెట్టిచాకిరీ చేయించారని, షర్మిల తనపై చెయ్యి చేసుకున్నారని అతను ఆరోపించాడు. ఈ వ్యక్తి కనిపించడం లేదని రవి కూడా న్యూజిలాండ్‌ పోలీసులకు తెలిపినట్లు సమాచారం.

కాగా, ఈ ఆరోపణల్ని రవి థాపర్‌ తోసిపుట్టారు. తన భార్య మర్యాదస్తురాలంటూ, ఆ వ్యక్తిపై చెయ్యి చేసుకునేంతటి శక్తి ఆమెకు లేదన్నారు. ఆ వ్యక్తిపై తాము ఎంతో నమ్మకం ఉంచామని, అయితే అతను తమ గురించి కట్టుకథలు అల్లాడని అన్నారు. భారత్‌లో ఒంటరిగా ఉంటున్న తన తల్లి బాధ్యతలను చూసుకోవడానికే స్వదేశానికి తిరిగి వెళుతున్నానని రవి చెప్పారు.