భారత్ బంద్…!!

bharat_bandh_2016నోట్లరద్దు నిర్ణయానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు నిరసనలకు దిగాయి. వామక్షాల పార్టీల కార్యకర్తలు పలుచోట్ల ధర్నాలు చేస్తూ ఉండగా, యూపీలో ఎస్పీ కార్యకర్తలు మోదీకి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. ఆక్రోశ్ ఉద్యమం పేరుతో దేశవ్యాప్తంగా ఉన్న ఆర్‌బీఐ కార్యాలయాల ఎదుట మానవహారాలతో కాంగ్రెస్ నిరసన తెలపనుంది. ఇటు పశ్చిమబెంగాల్‌లో బంద్ ప్రభావం పాక్షికంగా ఉంది. మధ్యాహ్నం 1గంటకు దాదాపు లక్షమందితో భారీ ర్యాలీకి మమతా బెనర్జీ సిద్ధమవుతున్నారు. ఇటు ఢిల్లీలో నిరసనలకు ఆమ్ఆద్మీపార్టీ సిద్దమవుతోంది. బీహార్‌లో జేడీయూ బంద్‌కు దూరంగా ఉండగా, ఆర్జేడీ కార్యకర్తలు మాత్రం ఆందోళనలో పాల్గొంటున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనూ విపక్షాలు నిరసనలతో హోరెత్తిస్తున్నాయి. తిరుపతిలో బస్టాండ్ ఎదుట ఆందోళనకు దిగిన వైసీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి తరలించారు. ఖమ్మం, సూర్యాపేట, కడప జిల్లా కేంద్రంలో తెల్లవారుజాము నుంచే వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. బస్ డిపోల ముందు ధర్నా చేశారు. గుంటూరులో వైసీపీ, వామపక్ష నేతలు బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.