భారత నౌకాదళంలో చేరిన యుద్ధనౌక.. ఐఎన్‌ఎస్‌ కొచ్చి

ship హైదరాబాద్‌: భారత నౌకాదళంలోకి మరో యుద్ధరీనౌకా ప్రవేశించింది. భారత్‌లో తయారు చేసిన అతిపెద్ద యుద్ధనౌకా ఐఎన్‌ఎస్‌ కొచ్చిని బుధవారం అధికారికంగా భారత నౌకాదళంలో చేర్చారు. ముంబయి నావల్‌ డాక్‌ యార్డ్‌లో భారత రక్షణ శాఖ మంత్రి మనోహర్‌ పారికర్‌ చేతులమీదుగా ఐఎన్‌ఎస్‌ కొచ్చిని నౌకాదళంలో చేర్చే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పారికర్‌ మాట్లాడుతూ విదేశీ యుద్ధ నౌకాలతో సమానంగా ఐఎన్‌ఎస్‌ కొచ్చి అత్యంత శక్తిమంతమైనదన్నారు.క్షిపణులను విధ్వంసం చేయగల సామర్థ్యం ఉన్న ఐఎన్‌ఎస్‌ కొచ్చిని అధునాతన డిజైన్‌తో రూపొందించారు. యుద్ధ నౌకా మనుగడ, భద్రత, డిజైన్‌, సామర్థ్యం సహా అన్ని అంశాల్లో మెరుగైన ప్రమాణాలను పాటించారు. ఈ యుద్ధ నౌకా 7,500 టన్నుల బరువు, 164 మీటర్ల పొడవు ఉంది.