భారత ప్రజాస్వామ్యంపరిపక్వతకు చేరలేదు

తొంబై శాతం ఓటర్లు మూర్ఖులే
నేను అందుకే ఓటు వేయ
మార్కండేయ ఖట్జూ సంచలన వ్యాఖ్య
న్యూఢిల్లీ, మార్చి 31 (జనంసాక్షి) :
భారతదేశంలో ప్రజాస్వామ్యం పరిపక్వత చెందలేదని ప్రెస్‌కౌన్సిల్‌ చైర్మన్‌ జస్టిస్‌ మార్కండేయ ఖట్జూ సంచలన వ్యాఖ్య చేశారు. ఆదివారం ఆయన ఓ జాతీయ మీడియా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పైవిధంగా స్పందించారు. దేశంలో 90 శాతం మంది ఓటర్లు మూర్ఖులేనని పేర్కొన్నారు. వారంతా గొర్రెల మాదిరిగానే ఓటేస్తారని, కులం, మతం ప్రాతిపదికన ఓటింగ్‌ జరుగుతుందని అన్నారు. అందుకే తాను ఓటు వేయబోనని స్పష్టం చేశారు. ప్రజాస్వా మ్యాన్ని ఫ్యూడల్‌ వ్యవస్థకు చెందిన భూస్వాములు పెట్టుబడిదారులు హైజాక్‌ చేశారని అన్నారు. ప్రజలు గొర్రెల మాదిరి ఓట్లు వేస్తుండటంతోనే పార్లమెంట్‌లోకి నేర చరితులు అడుగుపెడుతున్నారని వ్యాఖ్యానించారు. ఇలాంటి తరుణంలో తాను ఒక్కడినే ఓటు వేయకపోవడం వల్ల కొంపేమి మునిగిపోదని అన్నారు. తాను ఓటు వేసి పశువుల మందలో చేరడం ఇష్టం లేదన్నారు. విద్యావంతులైన లాయర్లు, ప్రొఫెసర్లు కూడా కుల ప్రాతిపదికపైనే ఓట్లేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అలహాబాద్‌ యూనివర్సిటీలో జరిగిన ఎన్నికలు ఈ విషయాన్ని నిరూపించాయన్నారు.