భారత బౌలర్ల విజృంభణ
పెర్త్: పసికూన యూఏఈపై భారత బౌలర్లు విజృంభిస్తున్నారు. టీమిండియా ధాటికి యూఏఈ బ్యాటింగ్ లైనప్ కకావికలమైంది. ప్రపంచ కప్ లో భాగంగా శనివారం టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్ లో 23 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 68 పరుగులు చేసింది. యూఏఈ జట్టులో ఖుర్రంఖాన్, షైమన్ అన్వర్ మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. అశ్విన్ 4 వికెట్లు తీశాడు.