భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకుల సమన్వయ సమావేశం..

భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకుల సమన్వయ సమావేశం

ధర్మపురి( జనం సాక్షి) ధర్మపురి పట్టణ కేంద్రంలోని లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్లో బుధవారం ఉదయం భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకుల సమన్వయ సమావేశం లో ఆరు మండలాల ఎంపీపీలు జడ్పిటిసిలు ఏఎంసి చైర్మన్లు వైస్ చైర్మన్లు సర్పంచులు ఎంపిటిసిలు బి ఆర్ఎస్ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొనగా వీరి సమావేశానికి మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.సభా వేదిక నుండి మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో సంక్షేమ పథకాలు ప్రతి ఇంటింటికి వెళుతున్నాయని బిఆర్ఎస్ నాయకత్వంలో తెలంగాణను నెంబర్ వన్ గా తీర్చిదిద్దిన కెసిఆర్ నాయకత్వంలో మళ్లీ కారు గుర్తుకు ఓటు వేసి కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణను మరింత అభివృద్ధిలోకి తీసుకురావడమే గొప్ప సంకల్పం అంటూ,తెలంగాణ రాష్ట్రంలో కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని తెలుపుతూ,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు.. వృద్ధాప్య పింఛన్లు, బీఈడీ కార్మికుల పింఛన్లు, నేత కార్మికుల పింఛన్లు, తెలంగాణ డయాలసిస్, ఉచిత డయాలసిస్ కార్యక్రమం, వితంతువులకు పింఛన్లు, దివ్యాంగులకు పింఛన్లు, బోదకాలు బాధితులకు పింఛన్లు, అమ్మబడి, ఆరోగ్యశ్రీ అత్యవసర, ఆరోగ్య రవాణా, ఒంటరి మహిళలకు ఫించన్లు, ఆసరా పింఛన్లు, బస్తీ దావకానలు, ఎంప్లాయిస్ అండ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్, కళాకారులకు పింఛన్లు, రైతుబంధు, లక్ష ₹ రూ. రుణమాఫీ, కళ్యాణ లక్ష్మి, కెసిఆర్ కిట్టు, బీసీ బందు, దళిత బంధు ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి ఇంటికి చేరుతున్న ప్రభుత్వ పథకాలు అమలవుతున్నాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు.ఈ సమావేశంలో రాష్ట్ర నాయకురాలు కొప్పుల నందిని అక్క మరియు మహిళ నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.