భారత వీసా నిబంధనల సరళీకరణ

న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం వీసా నిబంధనలను సడలించింది. విదేశీ పర్యటాకులపై ఇప్పటి వరకు ఉన్న నిబంధనలను ఇమ్మిగ్రేషన్‌ అధికారులు తొలగించారు. ఒకసారి భారత్‌కు వచ్చి వెళ్లిన విదేశీయుడు మళ్లీ భారత్‌కు రావాలంటే కనీసం 60 రోజుల అనంతరమే దరఖాస్తు చేసుకోవాలని నిబంధన ఉండేది. ఇప్పుడు ఆ నిబంధనను తొలగించారు. దీంతో ఇకపై విదేశీ పర్యాటకులు ఎన్నిసార్లైనా మన దేశానికి రావచ్చు పోవచ్చు. అయితే, ఈ సడలించిన నిబంధనలు కొన్ని దేశాలకు వర్తింపవని అధికారులు తెలియజేశారు. పాకిస్థాన్‌, చైనా, ఇరాన్‌, బంగ్లాదేశ్‌, అర్ఘనిస్తాన్‌, సూడాన్‌ దేశస్థులకు పాత నిబంధనల వర్తింపే కొనసాగిస్తామని వెల్లడించారు.