భారాస మండల మహిళా ఉపాధ్యక్షురాలిగా కుకట్ల రమ

మానకొండూరు, ఆర్ సి, జూలై 19, (జనం సాక్షి )

భారత రాష్ట్ర సమితి మానకొండూరు మండల మహిళా ఉపాధ్యక్షురాలిగా లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన కూకట్ల రమను నియమించినట్లు భారత రాష్ట్ర సమితి పార్టీ మానకొండూరు మండలాధ్యక్షులు తాళ్లపల్లి శేఖర్ గౌడ్ తెలిపారు. తనపై విశ్వాసం ఉంచి, పార్టీ పదవీ బాధ్యతలను తనకు కట్టబెట్టినందుకు మానకొండూరు శాసనసభ్యులు రసమయి బాలకిషన్, జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు, పార్టీ మండల అధ్యక్షులు తాళ్లపల్లి శేఖర్ గౌడ్ కు రమ కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ మహిళా విభాగం బలోపేతానికి తన శాయశక్తుల కృషి చేస్తానని, మహిళలను చైతన్యపరిచి భారత రాష్ట్ర సమితి పార్టీలో మహిళలకు తగిన ప్రాధాన్యత కల్పిస్తానని, మహిళా విభాగాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని ఆమె తెలిపారు.