భారీగా ఉద్యోగులపై వేటు

న్యూఢిల్లీ:  ఫ్లిప్‌కార్ట్‌తో అతిపెద్ద విలీన చర్చలను రద్దు చేసుకున్న ఈ కామర్స్‌సంస్థ   మరోసారి ఉద్యోగులపై భారీగా వేటువేయనుంది.   భారీగా  ఉద్యోగులను తొలగించనున్నట్టు   స్నాప్‌డీల్‌ సోమవారం  ప్రకటించింది.  మొత్తం ఉద్యోగుల్లో  80శాతం మందికి ఉద్వాసన పలకనున్నట్టు చెప్పింది.  అలాగే స్నాప్‌డీల్‌ వ్యవస్థపాకులు  కునాల్ బాల్‌, రోహిత్ బన్సల్ గత గురువారం సాయంత్రంమే  ఈ కీలక ఆదేశాలను జారీ చేసినట్టు సమాచారం.   తమ వ్యాపార, సాంకేతిక హెడ్లను తమ టీంను  పునర్నిర్మించాలని,  ఉద్యోగుల తొలగింపు కోసం  పేపర్‌వర్క్‌ను ప్రారంభించాలని గట్టిగా సూచించినట్టు తెలుస్తోంది.

సంబంధిత   విభాగాల హెడ్స్‌కు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు సంస్థ  సీనియర్ అధికారి  ఒకరు ఐఎన్‌ఎస్‌కు చెప్పారు. ఈ తీసివేత జాబితాను సిద్ధం చేయాల్సిందిగా కోరినట్టు తెలిపారు.  గత  ఏడాది జూలైలో  9వేలమంది ఉద్యోగులను కలిగి  వున్న   స్నాప్‌డీల్‌ ఇటీవల ఈ సంఖ‍్యను 12వందలకు కుదించింది.   దీంతో దేశీయ  ఈకామర్స్‌ లో అతిపెద్దడీల్‌గా నిలవనుందని , తద్వారా తమ ఉద్యోగాలకుఢోకా ఉండదని భావించిన ఉద్యోగులకు తీవ్ర నిరాశ ఎదురైంది.