భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్‌,జనంసాక్షి: బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి.నిన్నటితో పోలిస్తే 10 గ్రాముల బంగారం రూ. 1300, కిలో వెండి రూ. 28,00 ధర తగ్గింది. నగరంలోని మార్కెట్లో ఈ రోజు బంగారంం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 28,150గా ఉంది. 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 27,600గా ఉంది. కిలో వెండి ధర రూ. 49,700గా ఉంది.