భారీగా తగ్గుముఖం పట్టిన కరోనా
దేశంలో కొత్తగా 6,561 కరోనా కేసుల నమోదు
న్యూఢల్లీి,మార్చి3(జనం సాక్షి): దేశంలో కరోనా థర్డ్‌వేవ్ అనంతరం కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టింది. ఈ క్రమంలో మంగళవారం స్వల్పంగా పెరిగిన కేసుల సంఖ్య.. బుధవారం స్వల్పంగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6,561 కరోనా కేసులు నమోదయ్యాయి. బుశారం నాటికంటే కేసుల సంఖ్య భారీగా తగ్గింది. వేయి మేర కేసులు తగ్గాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 142 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో డైలీ పాజిటివిటీ రేటు 1 శాతానికి తక్కువగా ఉన్నట్లు కేంద్రం తెలిపింది. దేశంలో ప్రస్తుతం 77,152 (0.20?) కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మహమ్మారి కేసుల సంఖ్య 4,29,45,160 కి పెరిగాయి. దీంతోపాటు ఈ మహమ్మారితో ఇప్పటివరకు 5,14,388 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. కాగా.. కరోనా మహమ్మారి నుంచి 14,947 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 4,23,53,620 కి చేరింది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 98.62 శాతానికిపైగా ఉంది. వరుసగా 25 రోజుల నుంచి లక్షకు దిగువన కేసుల సంఖ్య నమోదవుతోంది.