భారీ వర్షాలకు నీట మునిగిన కన్నెపల్లి

పంపుహౌజ్‌లోకి నీరు చేరడంతో మోటర్ల మునక

జయశంకర్‌ భూపాలపల్లి,జూలై14(జనం సాక్షి): జిల్లాలోని కాళేశ్వరం కన్నెపల్లి పంపు హౌస్‌లోకి భారీగా వరద నీరు చేరడంతో బాహుబలి మోటర్లు నీట మునిగాయి. దీంతో భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. వరద నీరు పెద్ద ఎత్తున చేరడంతో మోటార్లు మళ్లీ నడుస్తాయో లేదోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. వరద వచ్చిన ప్రతీసారి మోటార్లు తడిసి పోవడం పరిపాటి అయిపోయింది. నీటిని ఎత్తిపోయాల్సిన మోటార్లు ఇలా వరద నీటిలో తడవడంతో వేలకోట్ల నష్టం వాటిల్లింది. అన్నారం పంప్‌ హౌస్‌ కూడా నీట మునిగింది.

కాగా కాళేశ్వరం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పుష్కర ఘాట్లు, చిన్న చిన్న దుకాణాలు నీట మునిగాయి. వరద పోటెత్తుతుండడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం 15.800 విూటర్లకు గోదావరి నీటి మట్టం చేరుకుందని అధికారులు తెలిపారు. లక్ష్మీ బ్యారేజ్‌ కి వరద నీరు భారీగా చేరుకుంటుంది. రికార్డు స్థాయిలో ఇన్‌ ఎª`లో వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇన్‌ ఎª`లో 22 లక్షల 15 వేల760 క్యూసెక్కులు కాగా ఔట్‌ ఎª`లో 22లక్షల 15 వేల 760 క్యూసెక్కులుగా ఉంది. మరోవైపు సరస్వతీ బ్యారేజీలోకి కూడా భారీగా వరద నీరు చేరుతోంది. బ్యారేజ్‌ పూర్తి స్థాయి నీటి సామర్ధ్యం 10.87 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి మట్టం 8.38 టీఎంసీలు ఉన్నట్లు అధికారులు తెలిపారు . ఇన్‌ ఎª`లో 14 లక్షల 77 వేల 975 క్యూసెక్కులు కాగా ఔట్‌ ఎª`లో 14 లక్షల 77 వేల 975 క్యూసెక్కులు ఉంది.