భారీ వర్షాలతో ఢల్లీిని అతలాకుతలం

` గోడకూలిన ఘటనలో 8 మంది మృతి
న్యూఢల్లీి(జనంసాక్షి):దేశ రాజధాని ఢల్లీిని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న కుండపోత వర్షం కారణంగా పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. జైత్‌పూర్‌లో శనివారం ఉదయం గోడ కూలిపోవడంతో 8 మంది మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. కొంతమంది శిథిలాల కింద చిక్కుకున్నారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు. రంగంలోకి దిగిన పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. దేశ రాజధాని ఢల్లీిలో భారీ వర్షాలకు గోడకూలి ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. హస్తినలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ ప్రమాదం సంభవించినట్టు- తెలుస్తోంది. ఢల్లీిలోని హరినగర్‌ లో ఈ ఘటన చోటు-చేసుకుంది. ఈ ప్రమాదంలో 8 మందిని రక్షించారు, తీవ్రంగా గాయపడ్డ నలుగురుని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భారీగా కురిసిన వర్షం కారణంగా హరి నగర్‌లోని జైత్‌పూర్‌ ప్రాంతంలో గోడ కూలిపోవడంతో, పాత ఆలయం పక్కనే ఉన్న జగ్గీలలో నివసిస్తున్న వాళ్లు ఈ ప్రమాదంలో చిక్కుకున్నారు. భవిష్యత్తులో అలాంటి ఘటనలు జరగకుండా జగ్గీలను ఖాళీ చేయించామని సౌత్‌ ఈస్ట్‌ అదనపు డీసీపీ ఐశ్వర్య శర్మ తెలిపారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఢల్లీి అగ్నిమాపక బృందాలు తక్షణమే రంగంలోకి దిగి సహాయక చర్యను ప్రారంభించాయి. మృతులను షబీబుల్‌ (30), రబీబుల్‌ (30), అలీ (45), రుబినా (25), డాలీ (25), రుక్సానా (6) హసీనా (7) గా గుర్తించారు. ఢల్లీిలోని సివిల్‌ లైన్స్‌లో నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోయి ఇద్దరు మృతి చెందిన ఘటన జరిగిన పది రోజుల తర్వాత ఈ ప్రమాదం చోటు-చేసుకుంది. ఢల్లీి ఇవాళ భారీ వర్షాలతో అతలాకుతలమైంది. వర్షాల కారణంగా దేశ రాజధానిలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాల కారణంగా వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. భారీ వర్షాల కారణంగా విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిరది. వాతావరణ శాఖ వెల్లడిరచిన సమాచారం ప్రకారం, శనివారం ఉదయం 8.30 గంటల వరకు సప్దర్‌జంగ్‌లోని ఢల్లీి ప్రాథమిక వాతావరణ కేంద్రంలో 78.7 మి.విూ., ప్రగతి మైదాన్‌లో 100 మి.విూ., లోధి రోడ్‌లో 80 మి.విూ., పూసాలో 69 మి.విూ., పాలంలో 31.8 మి.విూ. వర్షపాతం నమోదైంది. అటు-, యమునా నది నీటి మట్టం కూడా ప్రమాదకర స్థాయి 204.50 విూటర్లకు చేరుకుంది. ఓల్డ్‌ రైల్వే వంతెన దగ్గర ఉదయం 9 గంటలకు నీటి మట్టం 204.40 విూటర్లు ఉంది. దీంతో అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.