భారీ వర్షాలతో పరవళ్లుతొక్కుతున్న పోచారం ప్రాజెక్ట్‌

నిజామాబాద్‌: నాగిరెడ్డి మండలంలోని పోచారం ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టంతో పరవళ్లుతొక్కుతుంది. 20.6 అడుగులతో 1.82 టీఎంసీల నీరు ప్రాజుక్ట్‌లో నిల్వ ఉంది. అదనపు నీరు పొంగిపోర్లుతుంది. ప్రాజెక్ట్‌ ప్రధాన కాలువ ద్వారా 180క్యేసెక్కుల నీటిని విడుదల చేశారు. 300 క్యూసెక్కుల నీరు ప్రాజెక్ట్‌లోకి వచ్చి చేరుతుంది.