భారీ వర్షాలు కురిసే అవకాశం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – మంథని తహసీల్దార్ సిరిపురం గిరి


జనంసాక్షి , మంథని : రాబోయే 3 రోజులలో భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు
వాతావరణ శాఖ తెలిపినందున పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశానుసారం మంథని మండలంలోని అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంథని తహసిల్దార్ సిరిపురం గిరి సూచించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా నష్ట నివారణ చర్యల్లో భాగంగా బుధవారం నుండి మంథని తహసిల్దార్ కార్యాలయం లో కంట్రోల్ రూం ను ప్రారంభించి హెల్ప్ లైన్ నెంబర్ ను 9949818694 ఏర్పాటు చేయటం జరిగిందన్నారు.
ప్రకృతి విపత్తులకు సంబంధించిన సమాచారం లేదా సహాయం కోసం మంథని మండల హెల్ప్ లైన్ ను సంప్రదించాలని ఆయన కోరారు. నది, చెరువులు, వాగుల పరిసర ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని,ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లకుండా పటిష్ట చర్యలు చేపట్టామన్నారు.