భారీ వాహనాలకు అనుమతి లేదు: ట్రాఫిక్ ఎసిపి
హైదరాబాద్,ఆగస్ట్20(జనం సాక్షి): రద్దీ సమయాలలో భారీ వాహనాలకు నగరంలోకి అనుమతి లేదని, నిబంధనలకు విరుద్ధంగా ఎవైనా వాహనాలు నగరంలోకి ప్రవేశిస్తే వాటిపై కేసులు నమోదు చేస్తున్నామని నగర ట్రాఫిక్ అదనపు సీపీ అనిల్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు ఇది వరకే వాటార్ ట్యాంకర్స్ యజమానులు, డ్రైవర్లు, ప్రైవేట్ ట్రావెల్స్ ఏజెన్సీలు, ప్రైవేట్ బస్సు ఆపరేటర్లతో అవగాహన సమావేశాలు కూడా ఏర్పాటు చేశామన్నారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు మాత్ర మే భారీ వాహనాలకు నగరంలోకి అనుమతి ఉందని, ఈ విషయాన్ని భారీ వాహనదారులు గుర్తించుకోవాలన్నారు.