భారీ షెడ్ల నిర్మాణానికి కాలువ కరకట్ట మట్టి

 

అక్రమార్కుల కొమ్ముకాస్తున్న అధికారులేనా?

వీరి ఆగడాలను ఆపేది ఎవరు అంటూ ప్రశ్నిస్తున్న ప్రజలు

దంతాలపల్లి సెప్టెంబర్ 17 జనం సాక్షి
భారీ షెడ్ల నిర్మాణం కోసం ఎస్ ఆర్ ఎస్ పి మెయిన్ కెనాల్ కరకట్ట మట్టిని మాయం చేస్తున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే మండల కేంద్రం నుండి మరిపెడ వైపు వెళ్లే ఎస్సారెస్పీ ప్రధాన కాలువ కరకట్ట మట్టిని బీరిశెట్టిగూడెం గ్రామంలో నిర్మిస్తున్న భారీ షెడ్లకు అక్రమంగా యదేచ్చగా జెసిబితో తోడుతూ ట్రాక్టర్ల ద్వారా తరలిస్తూ ప్రజాధనాన్ని దోచుకుంటున్న దళారులు. భవిష్యత్తులో కాలువ ఉనికికే ప్రమాదం పొంచి ఉండడంతో పరిసర గ్రామాల రైతులు ఆందోళన చెందుతున్నారు.

మట్టి మాఫియాకు కొమ్ముకాస్తున్నది అధికారులేనా?

గత కొంతకాలంగా కాలువ కరకట్ట మట్టిని కొంతమంది అక్రమంగా తరలిస్తున్న సమాచారం తెలిసిన చూసి చూడనట్లు సహకరిస్తుండటంతో సంబంధిత అధికారులపై గ్రామస్తులు మట్టి మాఫియా కొమ్ముకాస్తున్నది అధికారులేనా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రజలు.

సంబంధిత ఏఈ వినయ్ కుమార్ ను వివరణ కోరగా

నేను వచ్చినప్పటినుండి ఇంతవరకు ఏ విధంగా సమస్య నా దృష్టికి రాలేదని అన్నారు.