భావి ప్రపంచాన్ని శాసించేది ఆహారరంగమే
సృష్టిలో మారనిది ఒకే ఒక్కటి వ్యవసాయం
కాలక్రమంలో అనేక వృత్తులు మారుతుంటాయి
శాస్త్ర, సాంకేతికత ఎంత పెరిగినా ఆహారం వ్యవసాయం ద్వారానే వస్తుంది .. దీనికి ప్రత్యామ్నాయం లేదు
రైతును మించిన అనుభవం గల శాస్త్రవేత్త ఈ భూగోళంలో లేడు
సృష్టిలో జీవులన్నింటికీ ఆహారం అవసరం
అన్ని జీవులు భుజించిన పంట ఆఖరుకు రైతు ఇంటికి వస్తుంది
800 కోట్ల పైచిలుకు ప్రపంచ జనాభాకు అవసరమైన ఆహారం అమెరికా, చైనా, భారత్ ల నుండే ఎక్కువ భాగం వస్తుంది
అమెరికా, చైనాల కన్నా సాగుకు యోగ్యమైన భూమి భారత్ లో అత్యధికంగా ఉన్నది
భవిష్యత్ ప్రపంచ ఆహార అవసరాలు తీర్చే శక్తి భారతదేశానికి మాత్రమే ఉన్నది
వ్యవసాయం ఆధునిక పరిశ్రమగా ఎదిగేందుకు వ్యవసాయ అనుకూల విధానాలు కావాలి
డాలర్లు, రూపాయలు ఆహారం అందించలేవు
మానవుడు స్థిరమైన వ్యవసాయం కనుక్కుని ఆచరించడం పదివేల సంవత్సరాలు అయింది
గత 120 ఏళ్ల కాలంలో వ్యవసాయరంగంలో అనేక మార్పులు సంభవించాయి
స్వాతంత్ర్య వచ్చిన కొత్తలో దేశంలో తిండిగింజలకే కొరత ఉండేది
అప్పట్లో వ్యవసాయం తర్వాత అతిపెద్ద పరిశ్రమ చేనేత
1963 తర్వాత వచ్చిన సస్యవిప్లవం మూలంగా వచ్చిన ఎరువులు, నూతన వంగడాలతో పంటలలో దిగుబడి పెరిగింది
భారతదేశ వ్యవసాయ పితామహుడు అంటే బాబూ జగ్జీవన్ రామ్ అనే చెప్పాలి
ఆకలి ఇబ్బందుల నుండి నిల్వలు దాచుకునే వరకు వచ్చాం
కాలక్రమంలో వ్యవసాయరంగంలో రసాయనిక ఎరువులు పెరిగి అనర్థాలకు దారితీస్తున్నాయి
సహజ ఎరువుల వినియోగం పెంచాలి
మనం తినే ఆహారంలో సమతుల్యత లేక అనారోగ్యం బారిన పడుతున్నాం
ఆరోగ్యవంతమైన భవిష్యత్ తరాల కోసం నేల ఆరోగ్యాన్ని పెంచేందుకు అందరం కృషిచేయాలి
రైతు తలఎత్తుకునే పరిస్థితి లేని దుస్థితి నుండి నేడు తెలంగాణలో నేను రైతును అని గర్వంగా చెప్పుకోగలుగుతున్నారు
పనిచేయని వారికి, కష్టపడని వారికి ఈ భూమి మీద తినే హక్కు లేదు
రైతుబంధు పథకం కింద పది ఎకరాల పైన ఉన్న రైతులు లబ్దిపొందుతున్నది కేవలం 1.22 శాతం మాత్రమే
రైతుబంధు పథకం గురించి కొందరు వ్యక్తులు, ఒక వర్గం మీడియా దుష్ప్రచారం చేస్తున్నారు
దేశాన్ని దోచుకుని విదేశాలకు పోయిన దొంగల గురించి వారు చర్చించరు .. వార్తలు రాయరు
కానీ రైతుకు చేసిన సాయం మీద వక్రభాష్యాలు చెబుతున్నారు .. ఈ ధోరణి మారాలి
వ్యవసాయంలో యాంత్రీకరణ పెరగాలి
రైతాంగానికి తక్కువ ధరలో యంత్రాలు అందేలా కృషిచేయాలని శాస్త్రవేత్తలను కోరడం జరిగింది
వ్యవసాయంలో ఊబరైజేషన్ రావాలి .. రైతుకు అవసరమైన యంత్రాలు అందుబాటులో ఉంచి సేవలు అందించేలా ఔత్సాహికులు ముందుకు రావాలి
ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని 2009 నుండి కేంద్రాన్ని కోరుతున్నాం
అధికారంలోకి వస్తే ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని బీజేపీ మేనిఫెస్టోలో పెట్టింది .. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించింది
రైతుబడి ఛానల్ నిర్వహణ ఒక ఉదాత్తమైన ఆశయం
యూట్యూబ్ ఛానళ్లు ప్రస్తుతం సమాజానికి ఉపయోగపడుతున్నట్లు లేవు
కానీ ఈ వ్యవసాయ యూట్యూబ్ ఛానల్ రైతులకు ఎంతో ఉపకరిస్తున్నది
వ్యవసాయ విజయాలను రైతుబడి ద్వారా రాజేందర్ రెడ్డి కష్టపడి చేస్తున్న సేవలు ప్రశంసనీయం
ఒక విశ్వవిద్యాలయం చేయాల్సిన పనులు తను చేస్తున్నాడు .. ఆయన ఛానల్ మరింత ఆదరణ పొందాలి
రైతుబడి వీడియోలు చూస్తే ఉత్సాహం, ఉద్వేగం అనిపిస్తుంది
కొత్తతరం, ఉన్నత చదువులు చదివిన వారు వ్యవసాయ రంగం వైపు కావాలి అన్న ఉద్దేశం ఆ వీడియోల్లో కనిపిస్తుంది
రవీంద్రభారతిలో నిర్వహించిన తెలుగు రైతుబడి యూట్యూబ్ ఛానల్ 1 మిలియన్ స్టోన్ మెగా ఈవెంట్ లో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పాల్గొన్న శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, సమాచార శాఖ మాజీ కమీషనర్, సీనియర్ జర్నలిస్ట్ కట్టా శేఖర్ రెడ్డి, రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ రాజావరప్రసాద్ రావు, రైతుబడి యూట్యూబ్ ఛానల్ అధినేత రాజేందర్ రెడ్డి తదితరులు
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యలు
వ్యవసాయం అంటే దండగ అన్న స్థితి నుండి కేసీఆర్ నాయకత్వంలో పండగ చేసుకున్నాం
రైతుబంధు, రైతుభీమా, సాగునీళ్లు, కరంటు, పంటల కొనుగోళ్లతో రైతుకు అండగా నిలిచారు
రైతుకు వ్యవసాయం గురించి సమాచారం ఇవ్వడం అవసరం
ప్రతి ఐదువేల ఎకరాలకు క్లస్టర్ ఏర్పాటు చేసి, రైతువేదిక నిర్మించి, వ్యవసాయ విస్తరణ అధికారులను నియమించింది
భూసార పరీక్షలు చేసి రైతుల నేలలను బట్టి పంటల సాగును ప్రోత్సహిస్తున్నారు
రైతుబడి డిజిటల్ మీడియా ద్వారా రాజేందర్ రెడ్డి రైతుల విజయాలను ఇతర రైతులకు తెలపడం బాగుంది
వ్యవసాయంలో తెలియనివి తెలుసుకోవాలి, తెలిసినవి ఇతరులకు తెలియజెప్పాలి
రైతుబడి ద్వారా రైతుల విజయాలు, ఇబ్బందులను బయటకు తీసుకు రావడం కోసం రాజేందర్ రెడ్డి చేస్తున్న కృషి అభినందనీయం
వ్యవసాయంలో సొంతంగా కష్టం చేస్తేనే విజయవంతం కాగలుగుతాం
రైతుబడి భవిష్యత్ లో రాష్ట్ర రైతులకు మార్గదర్శిలా నిలవాలి
సమాచారం తెలుసుకుని దానిని ఆచరించేందుకు ప్రయత్నించాలి
మాజీ సమాచార శాఖ కమీషనర్ , సీనియర్ జర్నలిస్ట్ కట్టా శేఖర్ రెడ్డి వ్యాఖ్యలు
రైతుబడి రాజేందర్ రెడ్డి కృషి గొప్పది
జర్నలిస్ట్ గా బస్తర్ లో కాకతీయుల చరిత్రను బయటకు తీసుకురావడంలో తనది కీలకపాత్ర
పది లక్షల మంది సబ్ స్క్రైబర్లు, 88 కోట్ల వ్యూస్ రావడం అభినందనీయం
వ్యవసాయ సమాచారం కోసం ఎంత మంది అన్వేషిస్తున్నారో దీన్ని బట్టి అర్దమవుతుంది
రైతుబడి బడిలా కాకుండా విశ్వవిద్యాలయంలా ముందుకు సాగుతున్నది
మన చుట్టూ ఉన్న వ్యవసాయ పంటలు, ప్రయోగాలు, యంత్రాల గురించి చెబుతున్న వివరాలు గొప్పవి
దీనిని మరింత విస్తరించాలి .. రైతులు రైతుబడిని ఆదరించాలి