భీతిల్లిన బ్రస్సెల్స్
– వరుస పేలుళ్లు
– 31 మంది మృతి
– 81 మందికి పైగా క్షతగాత్రులు
– ఖండించిన ప్రపంచ దేశాలు
బ్రస్సెల్స్,మార్చి22(జనంసాక్షి): బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ వరుస బాంబు పేలుళ్లతో దద్ధరిల్లింది. అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు పేలుళ్లు జరిగిన కొద్దిసేపటికే మెట్రో స్టేషన్‌లో జరిగిన మరో పేలుడు ప్రజల్ని తీవ్ర భయబ్రాంతులకు గురిచేస్తోంది. మంగళవారం విమానాశ్రయంలోని డిపార్చర్ హాల్‌వద్ద అమెరికా ఎయిర్‌లైన్స్ డెస్క్ సవిూపంలో, మరో మెట్రో స్టేషన్‌లోనూ భారీ పేలుళ్లు సంభవించాయి. ఆత్మాహుతి దాడి వల్ల ఈ పేలుళ్లు సంభవించాయని భావిస్తున్నారు. ఈ ఘటనల్లో ఇప్పటి వరకు 31 మంది మృతిచెందగా, 81 మందికి పైగా గాయపడ్డారు. విమానాశ్రయంలోని ప్రయాణికులను అత్యవసర ద్వారం నుంచి బయటకు తరలించారు. భద్రతా బలగాలు విమానాశ్రయాన్ని అదుపులోకి తీసుకుని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాయి. పారిస్ దాడిలో నిందితుడిగా ఉన్న సల్లాహ్ అబ్దెస్లామ్‌ను బ్రస్సెల్స్‌లో గత శుక్రవారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ అరెస్టుతో అక్కడ హైఅలర్ట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో పేలుళ్లు సంభవించడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. అయితే ఇది ఉగ్రవాదుల పనేనని, ఆత్మాహుతి దాడి జరిగి ఉండవచ్చని విమానాశ్రయ వర్గాలు భావిస్తున్నాయి. విమానాశ్రయానికి వెళ్లే అన్ని రైలు, బస్సు సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేశారు.
బ్రస్సెల్స్ మెట్రో స్టేషన్‌లో పేలుడు
బ్రస్సెల్స్‌లో బాంబుల మోత మోగుతోంది. విమానాశ్రయంలో జంట పేలుళ్లు సంభవించిన కొద్దిసేపటికే సవిూపంలో ఉన్న మాల్‌బీక్ మెట్రో స్టేషన్‌లో మరో పేలుడు సంభవించింది. ఒక్క ఈ ఘటన జరిగిన ప్రాంతంలోనే దాదాపు 15 మంది చనిపోయారని వార్తలు వెలువడుతున్నాయి. ద్రతా సిబ్బంది అక్కడున్న ప్రయాణికులను బయటకు తరలించారు. ఈ విషయాన్ని స్థానిక విూడియా వెల్లడించింది. ఈ పేలుడుతో బ్రస్సెల్స్‌లోని అన్ని మెట్రో స్టేషన్లనూ మూసివేశారు. మెట్రో రైలు సేవలను నిలిపివేశారు. సిటీ మ్యూజియాన్ని కూడా మూసివేసినట్లు సమాచారం.
ఏది జరగకూడదని భయపడ్డామో అదే జరిగింది : బెల్జియం ప్రధాని
బ్రస్సెల్స్‌లో ఏది జరగకూడదని భయపడ్డామో అదే జరిగిందని బెల్జియం ప్రధాన మంత్రి చార్లెస్ మైఖేల్ అన్నారు. ఘటన అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్నారు. క్షతగాత్రులను రక్షించేందుకు, వారికి వేగంగా వైద్య చికిత్సలు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్‌లో వెల్లడించారు.
‘విమానాశ్రయానికి ఎవరూ రావద్దు’
విమానాశ్రయంలో జంట పేలుళ్లు సంభవించిన అంశాన్ని బ్రస్సెల్స్ ఎయిర్‌పోర్ట్ వర్గాలు ధ్రువీకరించాయి. ఈ విషయాన్ని విమానాశ్రయ అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించాయి. ఎయిర్‌పోర్ట్‌వైపు ఎవరూ రావొద్దని, లోపల ఉన్న ప్రయాణికులందర్నీ అక్కడి నుంచి సురక్షితంగా బయటకు పంపించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నాయి. విమానాల రాకపోకల్ని నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు.
గాయపడిన వారిలో భారతీయులు లేరు: సుష్మా
బ్రస్సెల్స్‌లో జరిగిన జంట పేలుళ్లు ఘటనలో గాయపడినవారిలో భారతీయులు ఎవరూ లేరని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ వెల్లడించారు. జెట్ ఎయిర్‌వేస్ మహిళా సిబ్బందికి గాయాలయ్యాయన్నారు. అయితే ఆమె ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నట్లు చెప్పారు. బ్రస్సెల్స్‌లోని భారత రాయబారితో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. ఇండియా-ఈయూ సదస్సు కోసం మార్చి 30న ప్రధాని నరేంద్ర మోదీ బెల్జియం వెళ్లాల్సి ఉందని భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికారిక విూడియా ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు.
ఘటనపై ప్రముఖులగ్భ్భ్రాంతి
బ్రస్సెల్స్ ఘటనపై అంతర్జాతీయంగా పలువురు నేతలు తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనను భారత ప్రధాని నరేంద్రమోదీ తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ ఘటన సమాచారంగ్భ్భ్రాంతికి గురయ్యానని, బెల్జియానికి ఎలాంటి సాయం కావాల్సి వచ్చినా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని యూకే ప్రధాని డేవిడ్ కామెరూన్ ప్రకటించారు. ఈ విషయమై యూకే ఎమర్జెన్సీ కమిటీతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశామని, తదుపరి చర్యలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆయనతో పాటు ఈ ఘటనపై స్పందించిన వారిలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ¬లన్, లిథియేనియా అధ్యక్షురాలు డలియా గ్రేబౌస్కైతే, ట్రాన్స్‌పోర్ట్ యూరోపియన్ కమిషనర్ వైలెట్ బుల్స్, రిపబ్లిక్ ఆఫ్ కొసోవో మాజీ ప్రధాని, జార్జియా ప్రధాని తదితరులు ఉన్నారు.
బెల్జియం జెండా రంగుల వెలుగుల్లో ఈఫిల్ టవర్
బ్రస్సెల్స్ ఘటనకు సంఘీభావంగా ఈఫిల్ టవర్ ఈ సాయంత్రం బెల్జియం జెండా రంగుల వెలుగులో కనిపించనుంది. ఈ విషయాన్ని పారిస్ మేయర్ అన్నా హిందాల్గో ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ ఘటనలో మృతులకు సంఘీభావంగా ఈ చర్యచేపడుతున్నట్లు వెల్లడించారు.
యూరప్ లక్ష్యంగా తీవ్రవాదుల దాడులు’
బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో తీవ్రవాదుల ఆత్మాహుతి దాడులపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హాలండే మంగళవారం స్పందించారు. బెల్జియం మాత్రమే కాదు.. యూరప్
లక్ష్యంగా తీవ్రవాదులు ఈ ఆత్మాహుతి దాడులకు తెగబడ్డారని హాలండే పేర్కొన్నారు. పారిస్‌లో జరిగిన ఓ సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ.. తీవ్రవాదుల దాడులతో బ్రసెల్స్ అస్తవ్యస్థమైంది. ఈ దాడులపై ఒక్క యూరప్ మాత్రమే కాకుండా యావత్ ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయని అన్నారు. నిన్న ఫ్రాన్స్, నేడు బెల్జియంపై దాడులు జరిపారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు సమిష్టిగా తీవ్రవాదంపై పోరాడాల్సి ఉందని సూచించారు.ఈ బాంబు దాడుల నేపథ్యంలో ఫ్రాన్స్ ప్రభుత్వం పోర్టులు, స్టేషన్లు, విమానశ్రయాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను బలోపేతం చేసినట్టు తెలిపారు. బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో తీవ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడుల్లో 28 మంది దుర్మరణం చెందారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది, ప్యారిస్ లో బాంబుదాడులకు పాల్పడిన సలాహ్ అబ్దెస్లామ్‌ను అరెస్టు చేసిన నాలుగు రోజుల్లోనే ఈ ఘటన చోటుచేసుకోవడం ఒకింత
అనుమానాలకు తావిస్తోంది. కాగా, నవంబర్‌లో ప్యారిస్ లో తీవ్రవాదులు జరిపిన మారణ¬మంలో 130 మంది మృతిచెందిన సంగతి తెలిసిందే.
బ్రస్సెల్స్ బాంబు పేలుళ్లకు మాదే బాధ్యత’
బెల్జియం రాజధానిలో బ్రస్సెల్స్‌లో బాంబు పేలుళ్ల ఘటనకు తమదే బాధ్యతని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. మంగళవారం బ్రస్సెల్స్‌లోని జావెంటమ్ ఎయిర్
పోర్ట్ టర్మినల్ బిల్డింగ్ వద్ద రెండు చోట్ల, పక్కనే రైల్వే స్టేషన్ సవిూపంలో మరో పేలుడు సంభవించాయి. ఈ ఘటనలో కనీసం 30 మంది మరణించగా, మరో 35 మంది గాయపడ్డారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది, ప్యారిస్ లో బాంబుదాడులకు పాల్పడిన సలాహ్ అబ్దెస్లామ్‌ను అరెస్టు చేసిన నాలుగు రోజుల్లోనే ఈ ఘటన చోటుచేసుకుంది.బాంబు
పేలుళ్ల ఘటన అనంతరం తాత్కాలికంగా విమానాశ్రయాన్ని మూసివేశారు. నగరంలో హై అలెర్ట్ ప్రకటించారు. పోలీసులు నగరంలో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. అనుమానితులను అరెస్ట్ చేశారు. బెల్జియం, ఫ్రాన్స్ సరిహద్దును మూసివేసి ఉగ్రవాదుల కోసం భద్రత బలగాలు వేటాడుతున్నాయి.
పేలుళ్లతో అణు ప్లాంట్ తరలింపు
బ్రస్సెల్స్ లో వరుస పేలుళ్లు మారణ¬మం సృష్టించిన నేపథ్యంలో రెండు అణువిద్యుత్ ప్లాంట్ లను తరలించినట్టు తెలుస్తోంది. బెల్జియంలోని తిహాంగే, డోయల్ ప్లాంట్లను
తరలించారు. అధికారుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. తరలింపు గల పూర్తి కారణాలు తెలియరాలేదు. ఈ విషయాన్నిఫ్రెంచ్ బహుళజాతి విద్యుత్ వినియోగ కంపెనీ ఇన్జై ఒక ఒక ప్రకటనలో తెలిపింది. విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, సహజ వాయువు, పునరుత్పాదక ఇంధన రంగాల్లో సేవలందిస్తున్న ఈ కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ.. రక్షణ చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కొంతమంది ముఖ్య సిబ్బంది పర్యవేక్షణలో ప్లాంట్ కార్యకలాపాలు కొనసాగుతాయని తెలిపారు. బ్రసెల్స్ లో మంగళవారం ఉదయించిన ఈ పేలుళ్లలో కనీసం 34 మంది మరణించగా 170 మందికి పైగా గాయపడిన సంగతి తెలిసిందే.
బ్రస్సెల్స్ లో మా ఆయన క్షేమం: హీరోయిన్
న్యూఢిల్లీ: జెట్ ఎయిర్వేస్ విమానం కెప్టెన్ అయిన తన భర్త బ్రస్సెల్స్ లో క్షేమంగా ఉన్నాడని బాలీవుడ్ హీరోయిన్ గుల్ పనాగ్ తెలిపింది. జెట్ ఎయిర్ వేస్ విమానం బెల్జియం రాజధాని బ్రసెల్స్ విమానాశ్రయంలో ల్యాండైన కొద్దిసేపటికే ఆత్మాహుతి దాడులు కుదిపేశాయి. విమానాశ్రయంలో హాహాకారాలు, ఆర్తనాదాలతో భీతావహ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో బ్రసెల్స్ లో దిగిన జెట్ ఎయిర్వేస్ సిబ్బంది, ప్రయాణికులు ప్రస్తుతం క్షేమంగా ఉన్నారని గుల్ పనాగ్ ట్విట్టర్ లో తెలిపింది. తన భర్త, జెట్ ఎయిర్వేస్ కెప్టెన్ జీఎస్ అట్టారీ విమానంలో ఉన్నారని ఆమె వెల్లడించింది. ‘బ్రస్సెల్స్ విమానాశ్రయంలో ప్రస్తుతం ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం కొనసాగుతున్నది. భద్రతా సిబ్బంది ఇప్పటికీ బాంబులను కనుగొంటున్నారు. మా ఆయన, విమాన సిబ్బంది, ప్రయాణికులు ప్రస్తుతం సురక్షితంగా ఉన్నారు. అక్కడి వివరాలను ఎప్పటికప్పుడు మా ఆయన ద్వారా తెలుసుకొని ట్విట్టర్ లో షేర్ చేస్తున్నాను. దీనివల్ల విమానం సిబ్బంది, ప్రయాణికుల కుటుంబసభ్యులకు తమ వారి భద్రత గురించి తెలుసుకుంటారు’ అని ఆమె విూడియాతో పేర్కొంది. ‘ప్రయాణికులు, సిబ్బంది అంతా విమానంలోనే ఉన్నారు. వారి విమానం సురక్షిత ప్రదేశంలో ఉంది. ప్రతి గంటకు మా ఆయన తాజా సమాచారం అందిస్తున్నారు’ అని ఆమె తాజాగా ట్వీట్ చేశారు. న్యూఢిల్లీ నుంచి బ్రస్సెల్స్ వెళ్లిన జెట్ ఎయిర్వేస్ సిబ్బందిని, ప్రయాణికులను విమానం నుంచి ప్రస్తుతం దింపి.. పంపించివేశారని మరో ట్వీట్ లో వెల్లడించారు.
ఢిల్లీలో హై అలర్ట్
బెల్జియంలోని బ్రసెల్స్ విమానాశ్రయంలో పేలుళ్లు సంభవించిన నేపథ్యంలో ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఐబీ హైఅలర్ట్ ప్రకటించింది. ఢిల్లీ ఎయిర్‌పోర్టు వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. డాగ్, బాంబ్ స్కాడ్‌తో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. అన్ని విమానాశ్రయాలకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఆయా విమానాశ్రయాల సిబ్బందిని ఐబీ అప్రమత్తం చేసింది. బ్రసెల్స్‌లో ఉగ్రవాదదాడుల నేపథ్యంలో భారత్‌లోనూ హైఅలర్ట్ ప్రకటించారు. విమానాశ్రయాల దగ్గర భారీగా బలగాలను మోహరించారు. క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. రైల్వేస్టేషన్లు, రద్దీలుగా ఉండే ప్రాంతాలలోనూ భద్రత కట్టుదిట్టం చేశారు. బ్రసెల్స్ తరహా దాడులు మన దగ్గర కూడా జరగవచ్చని నిఘావర్గాలు హెచ్చరించడంతో రాష్ట్ర ప్రభుత్వాలను సైతం అప్రమత్తం చేశారు.
యూరప్‌లో బలపడే దిశగా ఐఎస్ తీవ్రవాదులు
యూరప్‌లో గత కొద్ది సంవత్సరాలుగా ఇస్లామిక్ ఉగ్రవాదులు బలపడుతున్నారు. ఇరాక్,సిరియా దేశాల్లో ఇస్లామిక్ స్టేట తరఫున పోరాడేందుకు పలు యూరప్‌దేశాలకు చెందిన అతివాద ముస్లిం యువకులు అక్కడకు వెళ్లారు. కొన్నాళ్ల తరువాత యూరప్‌కు తిరగివచ్చారు. వీరే ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు భద్రతాదళాలు అనుమానిస్తున్నాయి. పారిస్‌లో చార్లి హెబ్డో, పారిస్ దాడుల్లో ఐఎస్ హస్తముందని రుజువయింది. బెల్జియంలోనూ ఇస్లామిక్ స్టేట్ ప్రభావంతో అనేకమంది హింసాత్మక బాటపట్టినట్టు తెలుస్తోంది. మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికాల నుంచి ప్రతిరోజూ వేలాదిమంది యూరప్ దేశాలకు శరణార్ధులుగా వస్తున్నారు. వీరిలో అనేకమంది ఉగ్రవాదులున్నట్టు తెలుస్తోంది. యూరప్‌లోని పలుదేశాల్లో ఉగ్రవాదులను నిలువరిస్తున్నప్పటికీ పూర్తిగా అదుపుచేయలేకపోవడం గమనార్హం. యూరోపియన్ యూనియన్ ప్రధాన కేంద్రమైన బ్రస్సెల్స్‌లో దాడులు జరపడం ద్వారా తాము క్రియాశీలకంగానే వున్నామని చెప్పడమే ఉగ్రవాదుల లక్ష్యమని నిఘాసంస్థలు అనుమానిస్తున్నాయి. ఇకపోతే దాడుల తరవాత క్షతగాత్రుల రోదనలతో బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో విషాదం అలముకుంది. యూరోపియన్ యూనియన్ ముఖ్యకేంద్రమైన బ్రస్సెల్స్‌లోనే ఉగ్రవాదులు రెండు చోట్ల దాడులకు పాల్పడటంతో అంతర్జాతీయ సమాజం నివ్వెరపోయింది. విమానాశ్రయంతో పాటు మెట్రోరైలుపై దాడులు జరగడం గమనార్హం. పారిస్ ఉగ్రదాడులకు ప్రధాన వ్యూహకర్తగా అనుమానిస్తున్న అబ్దెస్లామ్‌ను నాలుగురోజుల కిందటే బెల్జియం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి ప్రతీకారంగానే ఇస్లామిక్‌స్టేట్ ఉగ్రవాదులు దాడులకు పాల్పడినట్టు నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. పటిష్టమైన భద్రత వుండే విమానాశ్రయంలోకి ప్రవేశించిన ఉగ్రవాదులు ఆత్మాహతిదాడులకు పాల్పడటం అందర్ని కలవరపరుస్తోంది. పారిస్‌లో ఉగ్రదాడులకు పాల్పడిన ఉగ్రవాదులు పలువురు బెల్జియంలోకి ప్రవేశించినట్టు నిఘావర్గాల సమాచారంలో దేశంలో నలుమూలల సోదాలు ప్రారంభించిన భద్రతాదళాలు ఉగ్రవాది అబ్దెస్లాంను అరెస్టుచేశాయి. దీంతో ప్రతీకారంగా ఉగ్రవాదులు ఆత్మాహతిదాడులకు పాల్పడే అవకాశముందని నిఘావర్గాలు హెచ్చరించాయి. అప్రమత్తంగా వున్నప్పటికీ ఉగ్రదాడులు జరగడం ఆందోళనకరమని బెల్జియం ప్రధాని ఛార్లెస్ మైకెల్ అన్నారు. బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ విమానాశ్రయంలో జంట పేలుళ్లపై అమెరికా రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఒకప్పుడు బ్రస్సెల్స్ చాలా అందమైన, సురక్షితమైన నగరమని.. కానీ ప్రస్తుత పరిస్థితులతో భయకంపిత వాతావరణం నెలకొందన్నారు. ఉగ్రదాడుల నేపథ్యంలో అమెరికా అప్రమత్తంగా ఉండాలని ట్రంప్ అభిప్రాయపడ్డారు.




