భుట్టో హత్య కేసులో ముషార్రప్ విచారణ
అనుమతించని ఉగ్రవాద వ్యతిరేక కోర్టు
మాజీ నియంతను ప్రశించనున్న ‘ఎఫ్‌ఐఏ’
ఇస్లామాబాద్-లాహోర్: పాకిస్థాన్ మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో హత్య కేసుకు సంబందించి మాజీ నియంత పాలకుడు పర్వేజ్ ముషార్రప్(69) ను విచారించేందుకు ఉగ్రవాద వ్యతిరేక న్యాయస్థానం గురువారం అనుమతి మంజూరు చేసింది. బేనజీర్ భుట్టోకు బెదిరింపు ఫోన్ కాల్స్ చేయటం ,హెచ్చరికలతో కూడిన ఈ మెయిల్స్ పంపటం తదితర అభియోగాలపై
ముషార్రఫ్‌ను నిందితుడిగా చేర్చి విచారించేందుకు కోర్టు అనుమతించింది. ఈమేరకు ప్రాసిక్యూషన్ అభ్యర్థనను అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.ఉమ్మడి విచారణ బృందం ముషార్రఫ్‌ను విచారించనున్నట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ(ఎఫ్‌ఐఏ) కి చెందిన ప్రత్యేక ప్రాసిక్యుటర్ చౌధురి జుల్పికర్ ఆలీ తెలిపారు. పాక్‌కు తిరిగి రావద్దంటూ బేనజీర్‌ను బెదిరించటం,అనంతరం ఆమె స్వదేశానికి చేరుకున్నార సరైన భద్రత కల్పించకపోవటం వంటి అంశాలపై ముషార్రఫ్ ను విచారిస్తామని చెప్పారు.
3 వ తేదీలోగా విచారణ పూర్తి
ఇస్లామాబాద్ శివారులోని ముషార్రఫ్ ఫాంహైస్‌లోనే ఆయన్ను ప్రశ్నిస్తామని విచారణ బృందం సభ్యుడైన జుల్ఫికర్ వివరించారు. భద్రతా కారణాల రీత్యా ముషార్రఫ్‌ను వ్యవసాయ క్షేత్రంలోనే ఉంచి సబ్‌జైలుగా ప్రకటించాలన్న తమ వినతిని న్యాయస్థానం అనుమతించినట్లు తెలిపారు.మే 3వ తేదీలోగా ముషార్రఫ్ విచారణను పూర్తి చేసి అనంతరం కోర్టులో చార్జీషీట్‌లో దాఖలు చేస్తామన్నారు. ముషారఫ్‌ను శుక్రవారం కోర్టులో హజరుపరుస్తామని వెల్లడిం