*భూపంపిణీతోనే పేదరిక నిర్మూలన*
వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యులు ములకలపల్లి రాములు పిలుపు
మునగాల, అక్టోబర్ 21(జనంసాక్షి): సమాజంలో అట్టడుగు వర్గాల పేదలైన వ్యవసాయ కార్మికులు వారి పేదరిక నిర్మూలనకు భూపంపిణీ సరైన మార్గమని, అందుకు సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యులు ములకలపల్లి రాములు పిలుపు ఇచ్చారు. శుక్రవారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మాధవరం గ్రామంలో జరిగిన మునగాల మండల మహాసభ అరె పిచ్చి రెడ్డినగర్ లో అరె రామకృష్ణారెడ్డి, మంద రేణుక అధ్యక్ష వర్గంగా జరిగిన ఈ మహాసభకు ముఖ్యఅతిథిగా ములకలపల్లి రాములు హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ, సమాజంలో సంపదను చూస్తున్న వ్యవసాయ కూలీలకు చేతినిండా పని, ఉండటానికి ఇల్లు, జబ్బు చేస్తే మెరుగైన వైద్యం లేక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని వారు అన్నారు. పాలకవర్గాలు పేదల సంక్షేమం కోసం తన ఎన్నికల్లో అనేక వాగ్దానాలు చేసినప్పటికీ నేటికీ అమలుకు నోచుకోవడం లేదన్నారు. అనేక పోరాటాల ఫలితంగా పోరాడి సాధించుకున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పాలకవర్గాలు తూట్లు పొడుస్తూ ఉపాధి చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారని వారు విమర్శించారు. సమాజంలో పేదరికం నిర్మూలించడం అంటే భూపంపిణీ సరైన మార్గమని వారు సూచించారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పైబడినా గాని పేదలకు భూపంపిణీ చేయడంలో పాలకవర్గాలకు చిత్తశుద్ధి లేదని అన్నారు. ఇప్పటికి తెలంగాణ రాష్ట్రంలో లక్షల ఎకరాల భూములు భూస్వాములు రియల్ ఎస్టేట్ బ్రోకరులు అక్రమంగా ఆక్రమించుకుని అనుభవవిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న కాలంలో పేదలందరూ భూపోరాటలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సంక్షేమ పథకాల పేరుతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు సంక్షేమ రంగాన్ని సమాధి చేస్తున్నారని వారు విమర్శించారు. ఇప్పటికైనా పాలక వర్గాలు వ్యవసాయ కూలీల మౌలిక సమస్యలు కూలి భూమి ఉపాధి సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. అనంతరం మండల నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. మండల అధ్యక్షుడిగా అరె రామకృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా సోమపంగు జానయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సోమపంగు జానయ్య, రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు దేవరం వెంకట్ రెడ్డి, కౌలు రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్కే సైదా, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు నాగయ్య, దేశగాని వీరబాబు, వలదాసు వీరస్వామి, ములకలపల్లి సైదులు, కిన్నెర వెంకన్న, వెంపటి వీరబాబు, సరికొండ నాగరాజు, కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు నందిగామ సైదులు, బోనాల మంగయ్య తదితరులు పాల్గొన్నారు.