భూరికార్డుల ప్రక్షాళనకు రూ. 17 కోట్లు విడుదల

తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశమయ్యారు ముఖ్యమంత్రి కేసీఆర్. సాయంత్రం వరకు..ప్రగతి భవన్ లో జరగనున్న మీటింగ్ లో భూ సమగ్ర సర్వే, రికార్డుల ప్రక్షాళన, విషయాలే ప్రధాన అజెండాగా మాట్లాడనున్నారు. భూరికార్డుల ప్రక్షాళన విషయంలో గ్రౌండ్ లెవల్లో జరగాల్సిన కార్యక్రమాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తారు. పహాణీ పుస్తకాలల్లో సరళమైన భాష వాడాలని సీఎం చెప్తున్నారు. వీటితోపాటు రైతు సంఘాల ఏర్పాటుమీద కూడా కీలక సూచనలు చేయనున్నారు. భూ రికార్డుల ప్రక్షాళన, రికార్డుల నిర్వహణ, పట్టాదారు పాస్ పుస్తకాల్లో మార్పులు, పహాణీల్లో సరళమైన భాష, రిజిస్ట్రేషన్లలో సంస్కరణలు ఇలా అన్ని విషయాల మీద కలెక్టర్ల మీటింగ్ లో మాట్లాడనున్నారు సీఎం.సెప్టెంబర్ 15 నుంచి రికార్డుల పరిశీలన ప్రారంభం, భూ సర్వేలో కలెక్టర్ల భాద్యతల మీద చర్చిస్తారు.  సమావేశంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్ రావు కమిటీ భూ సర్వే మీద ఇచ్చిన నివేదికపైనా చర్చ జరగనుంది. భూ సర్వే ఎన్ని రోజుల జరగాలి? ఎంత మందితో సర్వే చేయించాలి? కంప్యూటీకరణ ఎలా చేయాలి? ఇట్లాంటి అన్ని విషయాలపైన ముఖ్యమంత్రి కలెక్టర్లతో మాట్లాడి ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు. వీటితోపాటు రైతు సంఘాల ఏర్పాటుమీద కూడా కీలక సూచనలు చేయనున్నారు. సెప్టెంబర్ 1 నుంచి నియామకం చేయాలనీ, సమితిలో 15 మంది, మండల, జిల్లా రైతు సమన్వయ సమితిల్లో 24 మంది, రాష్ట్ర రైతు సమన్వయ సమితిలో 42 మందితో రైతులు ఉండేలా కమిటీల ఏర్పాటు చేయాలని గతంలోనే సీఎం చెప్పారు. దీనిపై కూడా ఈ సమావేశంలోనే క్లారిటీ రానుంది.