భూసమస్యల పరిష్కారానికి కృషి
జగిత్యాల,మే20(జనంసాక్షి): అర్హులందరికీ పట్టా పాసుపుస్తకాలు పంపిణీ చేస్తామని ఆర్డీవో ఆనంద్‌కుమార్ స్పష్టం చేశారు. అర్హులైన రైతులందరికీ పట్టా పాసు పుస్తకాలు తప్పనిసరిగా అందిస్తామన్నారు. గ్రామాల వారీగా భూసమస్యలను పరిష్కరించి, ఈకేవైసీ పూర్తి చేసి అప్పటికప్పుడే పాసు పుస్తకం పంపిణీ చేస్తామన్నారు. ఇప్పటికే పలు గ్రామాల రైతుల నుంచి భూసమస్యలపై దరఖాస్తులు స్వీకరించామన్నారు. గ్రామల్లో నెలకొన్న భూసమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు భూసమస్యల పరిష్కారానికి విూ భూమి-విూ పత్రాలు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా రోజుకో గ్రామానికి చెందిన రైతుల నుంచి భూసమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు. కొందరి రైతుల భూ సమస్యలు పరిష్కరించగా, వివిధ కారణాలతో ఐదు దరఖాస్తులు తిరస్కరించగా, మరో 19 మంది రైతులకు చెందిన భూసమస్యలు పరిష్కరించాల్సి ఉందన్నారు. విూ భూమి- విూ పత్రాలు కార్యక్రమంలో భాగంగా కొందరికి భూమికి సంబంధించిన పట్టా పాసు పుస్తకం అందజేశారు.