భూసర్వేపై నేడు అవగాహన సదస్సు

 

పోచారం సమక్షంలో అధికారులకు సూచనలు

హైదరాబాద్‌,ఆగస్ట్‌30: భూ సర్వేపై అధికారులకు ప్రత్యేక అవగాహన కల్పించేందుకు 31 గురువారం ప్రత్యేక సదస్సు నిర్వహిస్తున్నారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయి రైతు సమన్వయ సమితులు ఎంపిక పూర్తి చేశాక, వచ్చేనెల తొమ్మిదవ తేదీలోపు పూర్తి చేయాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగానే ఈనెల హైద్రాబాద్‌లో ప్రత్యేక అవగాహన సదస్సు జరగనుంది. ఆయాడివిజన్‌లకు చెందిన వ్యవసాయ సహాయ సంచాలకులు, మండల వ్యవసాయ శాఖ అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. గత కొద్ది నెలలుగా జిల్లాలో జరిపిన రైతు సమగ్ర సర్వే, వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో అమలు జరుగతున్న పథకాల తీరు పట్ల రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు ఉన్నత శ్రేణి అధికారులు సవిూక్ష చేయనున్నారు. అదే విధంగా రాబోయే కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గూర్చి అవగాహన కల్పించనున్నారు. ముఖ్యంగా రైతు సమన్వయ సమితీల ఏర్పాటులో అధికారుల పాత్రపై అవగాహన కల్పించనున్నారు. క్షేత్ర స్థాయిలో అధికారుల పర్యటన కమటీల ఎంపికలో తీసుకోవాల్సిన జగ్రాత్తల గూర్చి వివరించే అవకాశం ఉంది. ఇందుకోసం ఈ నెల 31వ తేదీన జిల్లాల్లోలోని అన్ని డివిజన్ల వ్యవ సాయ శాఖ సహాయ సంచాలకులు, మండల వ్యవసాయ శాఖ అధికారులకు హైదరాబాద్‌లో అవగాహన జరుగనుంది. 9 రోజుల పాటు ఆయా గ్రామాల్లో విస్తృతంగా అధికారులు పర్యటించి సమన్వయ సమితి కమిటీలకు రూపకల్పన చేసే విధంగా రాష్ట్ర ఉన్నతశ్రేణి అధికారులు దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్‌ రైతు సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టారు. రుణమాఫీ చేసి చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. సాగుకు తొమ్మిది గంటల విద్యుత్‌ అందించి చరిత్రలో నిలిచారు. సాగునీటికోసం ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి అపర భగీరథునిగా కీర్తి గడించారు.మిషన్‌ కాకతీయ చేపట్టి గొలుసుకట్టు చెరువుల జీవం పోశారు. రైతుకు గిట్టుబాటు ధర కల్పించడం జరిగింది. సబ్సిడీపై విత్త నాలు, యంత్ర పరికరాలు అందించి రైతుసంక్షేమానికి బాటలు వేశారు. చరిత్రలో నిలిచిపోయేలా వచ్చే ఏడాది నుంచి పెట్టుబడికి నగదు ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలను శరవేగం చేసిన సీఎం కేసీఆర్‌ మరో వైపు మిషన్‌కాకతీయ పథకం ద్వారా చెరువుల పూడికతీత పనులను చేపట్టడం జరిగింది. నిరంతర విధ్యుత్‌ సరఫరా, ఎరువుల, విత్తనాల కొరత లేకుండా చేయడంతో గత రెండు సంవత్సరాలుగా పంటల దిగుబడి పెరిగింది. పంట వేసింది మొదలు చేతికి వచ్చే వరకు అన్నివిధాలుగా పోత్సాహం అందుతుండటంతో రైతాంగం నూతన ఉత్తేజం తో సాగులో ముందుకు సాగుతున్నారు. రైతులకు మంచి ధర కల్పించాలనే ఉద్దేశంతో ప్రత్యేక పంటల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో దళారుల బారిన రైతులు పడకుండా చేసినైట్లెంది. గడిచిన మూడు సంవత్సరాలుగా వ్యవసాయశాఖలో అనేక మార్పులు తీసుకవచ్చిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా రైతు సమన్వయ సమితుల ఏర్పా టుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఆయా గ్రామాలలో ఉన్న రైతులను సంఘటితం చేయడంలో కీలక పాత్ర వహించే విధంగా ఈ సమితులకు రూప కల్పన చేయనున్నారు. వచ్చే నెల 9 లోపు జిల్లాలోని అన్ని రెవెన్యూ గ్రామాల పరిధిలో, మండల పరిధిలో, జిల్లా పరిధిలో రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ శాఖలో ప్రవేశపెట్టిన పథకాలు, వాటి అమలు, రాబోయే రోజుల్లో తీసుకో వాల్సిన జాగ్రత్తలపై సవిూక్ష చేయ నున్నారు. ఇప్పటికే గ్రామాల పరిధిలో రైతులకు అందుబాటులో ఉండేందుకు గాను ఏఈఓలను నియమించిన రాష్ట్ర ప్రభుత్వం వచ్చే సంవత్సరం రైతులకు అందించే పెట్టుబడిని సక్రమంగా అమలు జరిగేందుకు గాను రైతు సమన్వయ కమిటీలను బలోపేతం చేయనుంది. అదే విధంగా రైతులు ఎలాంటి పంటలు పండించాలి. మార్కెటింగ్‌ వ్యవస్థపై అధ్యయనం, ఆధునిక సాగు తదితర అంశాల ప్రాతిపాదికగా ఈ కమిటీలు పనిచేయనున్నాయి.