భూస్వాముల కొమ్ము కాసేలా రైతుబంధు: జీవన్‌ రెడ్డి

హైదరాబాద్‌,మే26(జ‌నంసాక్షి): భూస్వాములకు కొమ్ముకాసేలా రైతుబంధు పథకం ఉందని సీఎల్పీ ఉపనేత జీవన్‌ రెడ్డి విమర్శించారు. పంటబీమా పథకాన్ని భూ యజమానులతో పాటు సాగు రైతులకు అందజేయాలని డిమాండ్‌ చేశారు. శనివారం విూడియాతో మాట్లాడిన జీవన్‌ రెడ్డి.. రైతుబంధు పథకంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని సూచించారు. పాస్‌ పుస్తకాలు తప్పులతడకగా ఉన్నాయని, కొనుగోలు చేసిన భూమిని తనకు అనువంశికంగా వచ్చినట్లు నమోదుచేశారని తాను ఎదుర్కొన్న సమస్యను జీవన్‌ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. కొత్త రెవెన్యూ చట్టాన్ని జగిత్యాలలో నడిస్తున్నారని అన్నారు.