భూ కబ్జాలతో వస్తున్న ఆరోపణలతో నాకు ఎలాంటి సంబంధం లేదు : మున్సిపల్ వైస్ చైర్మన్
జనం సాక్షి: నర్సంపేట
నర్సంపేట పట్టణంలోని పాకాల ఆయుకట్టు జాలు బంధం కాలువ భూమిని కబ్జా చేస్తున్నామని చెప్పి నాపై చేస్తున్న ఆరోపణలు కాంగ్రెస్ నాయకులు మానుకోవాలని నర్సంపేట మున్సిపాలిటీ వైస్ చైర్మన్ మునిగాల వెంకట్ రెడ్డి అన్నారు. అనంతరం తన స్వగృహంలో శుక్రవారం రోజున పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది .ఈ సమావేశంలో తను మాట్లాడుతూ ఆయకట్టుకు సాగునీరు అందడానికే కాల్వకు తన భూబదాలింపు చేశనని , ఆయకట్టు లేనందున గౌడ సంఘానికి, గుడికి కేటాయించాము. నాడు వారి నాయకుడు మాధవరెడ్డి కొబ్బరికాయ కొట్టాడు.ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించే స్థాయి వారికి లేదు. హత్య రాజకీయాల కుటుంబాలకు చెందిన వాడను నేను కాదు. 35 సంవత్సరాల నుండి రాజకీయాలు ద్వారా నా గ్రామ ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాను. అది గమనించాలని కోరుకుంటున్నాను. నాపై ఎవరైతే వేరే పార్టీకి చెందిన నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారో వారి గత జీవితానికి సంబంధించిన ముత్తాతలు, తాతల జీవిత చరిత్ర చూస్తే అర్థమవుతుంది వారా నేరచరిత్ర గలిగిన వంశస్థుల మీమా అన్నది వారికే అర్థం కావాలి అని అన్నారు. ..దొంతి లా జైల్ కు వెళ్లినవాడ్ని కాదు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నిస్వార్థ ప్రజాసేవకుడు. సాధారణ రైతు కుటుంబానికి చెందిన వారు..మీ నాయకుడిలా కాంట్రాక్టర్ కాదు..కబ్జా కోరుడు అసలే కాదు.నాడు జిల్లా ఆసుపత్రి నిర్మించుటకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్థల సేకరణ చేయాలని అడిగారు , సాగులో ఉన్న రైతులకు ఎమ్మెల్యే దొడ్డ మోహన్ రావు సహకారంతో రైతులకు నష్టపరిహారం ఇప్పించారు.ఒక్క రైతు నాడు అందుబాటులో లేనందున అప్పుడు పరిహారం ఇవ్వడం కుదరలేదు. ఆ తర్వాత కొంతకాలానికి దొడ్డ మోహన్ రావు సార్ అనారోగ్యం కారణంగా కలువలేక పోయారు..ఈ రైతుకు చెందిన భూమి ఆసుపత్రి కి పోతుంది. కావున రైతు నష్టపోవద్దని అతనికి సేకరించిన స్థలం నుంచే పక్కన బదులుగా ఇవ్వాలని ఎమ్మెల్యే సూచించారు.
నేను పాత్రికేయ మిత్రుడు అని చెప్పుకుంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ భూ విషయలలో పలువురిని భయభ్రాంతులకు గురి చేస్తూ భూ ఆక్రమణలకు పాల్పడుతున్న విలేకరి రాజేందర్ రెడ్డి.ఆ జాలు బంధం కాలువ స్థలంపై కూడా తన కన్ను పడి ఏదో ఒక విధంగా తనకే కేటాయింపు చేయ లని బెదిరించాడు. నేను ఆ స్థలాన్ని తనకు ఇవ్వలేదనే కోపంతో నాపై తప్పుడు రాతలు రాస్తున్నాడు అంతేకాకుండా ఆ స్థలాన్ని ఇవ్వకపోయేసరికి కొంతమంది వేరే పార్టీ నాయకులతో కలిసి నా పైన తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. గతంలో నన్ను బెదిరించి నా స్వంత భూమిని తక్కువ ధరకు కొనుగోలు చేసి దానిని ఎక్కువ రేటుకు అమ్ముకొని లాభపడ్డాడు. అలాంటి వ్యక్తి పాత్రికేయుడుగా కొనసాగే అర్హత లేదన్నారు. ఇక మీదట కూడా ఇలా నాపై తప్పుడు ఆరోపణలు చేస్తూ పత్రికల్లో తప్పుడు రాతలు రాస్తే కనుక అతనిపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటానని అన్నారు.
జాలుబందం కాల్వ కింద తమ ఆయకట్టు ఉంది.అది 20 యేండ్ల గా సాగులో లేదు.. ప్రస్తుతం ఇండ్ల స్థలాలగా మారింది.కేవలం మూడు ఫీట్ల కాల్వకు బదులు రైతుల అంగీకారంతో చివరి ఆయకట్టు కు నీరు వెళ్లుటకు తనే బదిలాంచాను.. ఒక వేల రికార్డు ప్రకారం భూమి ఉందని ఇరిగేషన్ అధికారులు తేల్చితే ఒదిలిపెట్టడానికి సిద్దంగా ఉన్నా,దీన్ని కాంగ్రెస్ వారు తాను కబ్జా చేశాననీ, ఇందుకు ఎమ్మెల్యే సహకరించాడని తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదు.వారి ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్వాపురం మాజీ సర్పంచ్ గడ్డం శ్రీనివాస్ ఎర్రబెల్లి సదయ్య కొప్పు భాస్కర్ వేమా స్వామి ఎర్రబెల్లి కుమార్ తాడెం పాపయ్య మోతే నరేందర్ రెడ్డి నరసింహ రాములు తదితరులు స్థానికులు పాల్గొన్నారు
Attachments area