భూ నిర్వాసితులకు ప్రాధాన్యం
– ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం కేసీఆర్ ఆదేశం
హైదరాబాద్,మే3(జనంసాక్షి): తెలంగాణలో భూములను సస్యశ్యామలం చేయడానికి, కోటి ఎకరాలకు నీరందించే లక్ష్యంగా చేపడుతున్న భారీ నీటి పారుదల ప్రాజెక్టుల వల్ల నిర్వాసితులయ్యే వారిని పూర్తిస్థాయిలో ఆదుకోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంకల్పించారు. ఈ మేరకు అధికారిక నివాసంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో చేపట్టే భారీ నీటిపారుదల ప్రాజెక్టుల వల్ల భూములు, నివాసాలు కొల్పోయే వారిని అన్ని విధాల ఆదుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. నిర్వాసితులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. భూనిర్వాసితుల పరిహారం, రిజర్వాయర్లకు భూసేకరణ తదితర అంశాలపై సీఎం కేసీఆర్ ఆయన మాట్లాడారు. తెలంగాణ కోటి ఎకరాలకు సాగు నీరు ఇవ్వడానికి ప్రాజెక్టులు కడుతున్నామని తెలిపారు. ఎక్కువ ముంపు లేకుండానే ప్రాజెక్టుల రీడిజైనింగ్ చేశామని స్పష్టం చేశారు. అయినప్పటికీ రిజర్వాయర్ల నిర్మాణం కోసం కొంత ముంపు తప్పదన్నారు. ఇలా భూమి వ్వడానికి ముందుకు వచ్చిన వారికి అన్యాయం జరగరాదన్నారు. భూనిర్వాసితులకు కొత్త జీవితం ప్రసాదించాలని ముఖ్యమంత్రి అన్నారు. పరిహారాల చెల్లింపు విషయంలో జాప్యం జరుగకూడదని ఆయన తెలిపారు. ఒకవేళ జాప్యం జరిగితే కఠిక చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.సూచించారు. నిర్వాసితులు కోల్పోయే భూమి, ఇల్లు, పశువుల కొట్టం తదితర ఆస్తులకు ఒకేసారి చెక్కులను అందించాలని ఆదేశించారు. ఏక మొత్తంలో డబ్బులు ఇవ్వడం ద్వారా నిర్వాసితులు ఇష్టమొచ్చిన ప్రాంతంలో స్థిరపడే అవకాశం ఉందన్నారు. స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు, మంత్రులు నిర్వాసితులతో మాట్లాడి అవసరమైన భూసేకరణ చేయాలన్నారు. అలాగే పాలమూరు, కాళేశ్వరం ప్రాజెక్టులకు అధికారిక లాంఛనాలు పూర్తి అయినందున పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. కాళేశ్వరం బ్యారేజీ పూర్తయ్యే దాకా ఎదురుచూడకుండా పంప్ హౌజ్ ద్వారా నీరు పంపాలని సూచించారు. ఏడాదిన్నర లోపే కాళేశ్వరం నుంచి మిడ్‌మానేరు వరకు నీరందించడం లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. బ్యారేజీలు, పంప్‌హౌజ్‌లను రిజర్వాయర్లకు సమాంతరంగా నిర్మించాలని చెప్పారు. ఎక్కడ సమస్య తలెత్తినా వెంటనే స్పందించి పరిష్కరించాలని మంత్రి హరీష్‌రావును ఆదేశించారు. సవిూక్ష సమావేశానికి మంత్రులు హరీష్‌రావు, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే రామలింగారెడ్డి, సీఎస్ రాజీవ్‌శర్మ, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.




