భూ సమస్యను పరిష్కరించండి

జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు.
గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 2 (జనం సాక్షి);
మాకు న్యాయం చేయాలని, పొలం పక్కన ఉన్న వారి పై చర్యలు తీసుకొని మాకు భూ సమస్యను తీర్చాలని జోగులాంబ గద్వాల జిల్లా కేటి దొడ్డి మండల పరిధిలోని గువ్వలదిన్నె శివారులోని బాధితులు అంజనమ్మ అతని భర్త పెద్ద ఈరన్న జిల్లా కలెక్టర్, ఎస్పీ కి ఫిర్యాదు చేశారు.
జోగులాంబ గద్వాల జిల్లా కేటి దొడ్డి మండలం గువ్వల దీన్నే శివారులోని కురువ కరీం సాబ్ కి చెందిన పొలము సర్వేనెంబర్ 315 లో 4 ఎకరముల 36 గుంటల భూమిని సాగు చేస్తూ జీవనం గడుపుతున్నారు. ఈ భూమి వారసత్వముగా వచ్చినది. కురువ కరీం సాబ్ బాగస్తులైన నరసింహులు, మల్లయ్య, జనప్ప, విజప్ప, మలప్ప, అద్దాల జంగిలయ్య, గోవిందమ్మ, అనంతమ్మ, నరసమ్మ వీరంత కలిసి మా పొలము గేట్లకు పాతిన రాళ్లను తొలగించి,వేప చెట్లను నరుకుతుంటే ఎందుకు నరుకుతున్నావని అడిగితే గొడ్డలి, సలికలతో దాడి చేశారు. మిమ్ములను చంపుతాము మీకు ఎవరు అడ్డు వస్తారు అంటూ బెదిరింపులకు గురి చేస్తున్నారు. గత 10 సంవత్సరముల నుండి ఈ విషయంపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని బాధితులు అంజనమ్మ భర్త పెద్ద ఈరన్న ఆరోపించారు. తహసిల్దారు, ఆర్ఐలకు ఫిర్యాదు చేస్తే వ్యవసాయ పొలం మోకపై వచ్చి మా పొలం పక్కల ఉన్న 9 మంది వ్యక్తులను కలిసి ఆర్ ఐ నగేష్ తమపై దురుసుగా మాట్లాడి , మీరు కలెక్టర్ ,
ఎస్పీల దగ్గరకు వెళ్లిన ఫైల్ మా ఆఫీస్ కి వస్తుందని అది కచ్చితంగా వారి వైపు మేము ఉంటామని, మీరు మాకు ఎలాంటి రుసుములు ఇవ్వలేదని, మాకు రుసుములు చెల్లిస్తేనే న్యాయం చేస్తామని తెగేసి చెప్పి వెళ్లిపోయారని వారు ఆరోపించారు. స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి మాకు న్యాయం చేయండి అని అడిగితే ఎస్సై బయటకి పొండి అంటూ దౌర్జన్యంగా పోలీస్ స్టేషన్ నుండి తమను వెళ్లగొట్టినట్టు వాళ్ళ ఆరోపించారు. జూన్ 27న హైకోర్టు ఉన్నత న్యాయస్థానం నుండి జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ కి వారిపై చర్యలు తీసుకోవాలని విన్నవించిన ఇప్పటివరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు అన్నారు. 9 మంది వ్యక్తులపై మోసం, బెదిరింపు, అధికార దుర్వినియోగం చేస్తూ, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ, ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని వారు జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా మానవ హక్కుల కమిషన్, లోకయుక్తకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని వారు తెలిపారు. ఈ విషయంపై కె. టి. దొడ్డి తహసిల్దార్ సుందరరాజును వివరణ కోరగా మా దృష్టికి రాలేదని, తెలుసుకొని వివరాలు తెలుపుతానని ఆయన అన్నారు.