భూ సెటిల్‌మెంట్లతో.. రేవంత్ కోట్లు సంపాదించాడు
– ఐటీ సోదాలకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడయ్యాయి
– రేవంత్ రౌడీషీటరా అని అనుమానం కలుగుతుంది
– దందాలు చేసేవారికే కాంగ్రెస్‌లో మంచి గుర్తింపు
– మహిళలు బతుకమ్మ అడితే కేసులు పెడతారా
– పాతబస్తీ ఏమైనా పాకిస్తాన్‌లో ఉందా?
– కేసీఆర్, కవితలు తెలంగాణ ఆడపడుచులకు క్షమాపణలు చెప్పాలి
– విలేకరుల సమావేశంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు
హైదరాబాద్, అక్టోబర్20(జనంసాక్షి) : భూ సెటిల్‌మెంట్లు, అక్రమాలతో కాంగ్రెస్‌నేత రేవంత్‌రెడ్డి కోట్లు సంపాదించాడని, ఆయన ఇంట్లో ఐటీ సోదాలకు సంబంధించి పూర్తి వివరాలు బయటకు వచ్చాయని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. ల్యాండ్ సెటిల్‌మెంట్ల్‌తో, భూకబ్జాలతో రేవంత్ రెడ్డి కోట్లు సంపాదించారని అన్నారు. ఈ సందర్భంగా ఐటీ దాడులకు సంబంధించిన రిపోర్టులను జీవీఎల్ విూడియాకు అందజేశారు. సెటిల్‌మెంట్ల్‌తో రూ.11కోట్ల నల్లధనం వచ్చిందని రేవంత్ బావమరిది చెప్పారని, రేవంత్ మామ వద్ద 11లక్షల నగదు, 1.2 కిలోల బంగారం సీజ్ చేసినట్లు ఐటీ తెలిపిందని అన్నారు. కేఎల్‌ఎస్‌ఆర్ ఇన్‌ఫ్రాటెక్ డైరెక్టర్ వద్ద 1.40కోట్లు దొరినట్ల ఐటీ వెల్లడించిందని పేర్కొన్నారు. రేవంత్ సోదరుడి కంపెనీ భుపాల్ ఇన్‌ఫ్రాటెక్ సబ్ కాంట్రాక్టు పనులు చేసిందని, కులీలకు డబ్బులు ఇచ్చామని అనేక రెట్లు పెంచి చూపించారని అన్నారు. భూలావాదేవీలతో నల్లధనాన్ని సంపాధించి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. రేవంత్ ఓటుకు కోట్ల కుంభకోణానికి కూడా పాల్పడ్డారని, రేవంత్ రెడ్డి రాజకీయ నాయకుడిలా లేడని, రౌడీ షీటర్‌లా ఉన్నాడని జీవీఎల్ ఘాటుగా విమర్శించారు. సీఎం రమేష్, రేవంత్ రెడ్డిలు అనేక వాటికి ట్యాక్స్‌లు ఎగకొట్టారని అన్నారు. పన్నులు ఎగొట్టేవారికి కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు బాగా ఉంటుందని జీవీఎల్ ఎద్దేవా చేశారు. తెలంగాణలో బతుకమ్మ అడుతున్న మహిళపై కేసులు పెట్టడం ఏంటని జీవీఎల్ ప్రశ్నించారు. ఓల్డ్ సిటీ ఏమైనా పాకిస్తానా అని ప్రశ్నించారు. కేసీఆర్ పాతబస్తీని ఒవైసీకి రాసిచ్చారా? అని నిలదీశారు. కేసీఆర్, కవిత తెలంగాణ ఆడపడుచులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఓవైసీకి తలవంచిన కేసీఆర్, విమోచన దినోత్సవం జరపకపోవడం సిగ్గుచేటని జీవీఎల్ అన్నారు.
రాహుల్ కోట్లు కొల్లగొట్టాడు..
యంగ్ ఇండియా పేరుతో రాహుల్ గాంధీ కూడా కోట్ల రూపాయలు కొల్లగొట్టారని, నేషనల్ హెరాల్డ్ కేసులో కూడా రాహుల్ పాత్ర ఉందని జీవీఎల్ విమర్శించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన చెప్పుకున్నంత ఉత్తముడు కాదని, దేశం కోసం సేవ చేశానని గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి విషయంలో రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. దక్షిణాది రాష్ట్రాలను అవమానించిన పంజాబ్ మంత్రి సిద్దూపై కాంగ్రెస్ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు. దక్షిణాది అంటే కాంగ్రెస్‌కే వివక్ష అని, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మృతదేహాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌లోకి తీసుకెళ్లలేదని ధ్వజమెత్తారు. సోనియాగాంధీ అదేశాల వల్లనే పీవీకి అవమానం జరిగిందని.. రాజీవ్ కూడా అంజయ్యపై వివక్ష చూపించారని అన్నారు.