భూ సేకరణ ఆర్డినెన్సుకు రాష్ట్రపతి ఆమోదం
న్యూఢిల్లీ, మే31(జనంసాక్షి) : ల్యాండ్ ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. శనివారం రోజే కేంద్ర కేబినెట్ ఈ ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపిన
విషయం తెలిసిందే. భూసేకరణ చట్టానికి సంబంధించిన ల్యాండ్ ఆర్డినెన్స్ తీసుకురావడం ఇది మూడోసారి. ఆర్డినెన్స్ రూపంలో ఉన్న దీనిని ఇటీవల ముగిసిన బడ్జెట్ సమావేశాల్లో
కూడా చట్టరూపంలోకి మార్చలేకపోవడంతో తిరిగి మరోసారి ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. నష్టపోయిన రైతులకు పరిహారం అందజేయడంతోపాటు ఆ బిల్లు భవిష్యత్ మనుగడ కోసం తప్పకుండా ఆర్డినెన్స్ అవసరం అని ప్రధాని చెప్పడంతో కేబినెట్ దానిని శనివారం ఆమోదించింది.