భౌతికశాస్త్రంలో నోబెల్‌ కూడా ఇద్దరికి

 

స్వీడన్‌: భౌతికశాస్త్రంలో నోబెల్‌ పురస్కారం కూడా ఈ ఏడాది ఇద్దరిని వరించింది. ఫ్రెంచి శాస్త్రవేత్త సెర్జి హరోచె, అమెరికన్‌ శాస్త్రవేత్త డేవిడ్‌ వైన్‌లాండ్‌లు భౌతిక శాస్త్ర నోబెల్‌ను సంయుక్తంగా గెలుపొందారు. క్వాంటామ్‌ పార్టీకిల్స్‌కు సంబంధించి ఇప్పటి వరకు అసాధ్యమనుకున్న అంశాన్ని వీరి పరిశోధనలు సాధ్యం చేయనున్నాయని నోబెల్‌ బహుమతి కమిటీ పేర్కొంది. ఫలితంగా క్వాంటమ్‌ ఫిజిక్స్‌లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోబోతున్నాయని వారు పేర్కొన్నారు.