మంకీపాక్స్‌పై ఆందోళన అవసరం లేదు
ఇది కొత్త వైరస్ కానేకాదు
ఇప్పటికే రాష్టాల్రను అప్రమత్తం చేశాం
వ్యాక్సిన్ తయారీకి ప్రయత్నాలు చేస్తున్నాం
కరోనా కష్టాల్లో ఎన్నో పాఠాలునేర్చుకున్నాం
రాజ్యసభలో కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి మాండవీయ వెల్లడి
న్యూఢల్లీి,అగస్టు2(జనంసాక్షి): మంకీపాక్స్ విషయంలో దేశ ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. వైరస్ కట్టడికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశామన్న మంత్రి.. వ్యాక్సిన్ విషయంలోనూ చకచకా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. దేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మాండవీయ.. దేశ ప్రజలకు కీలక సూచనలు చేశారు. వైరస్‌పై రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఇన్ఫెక్షన్లు వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. రాజ్యసభలో మాట్లాడిన ఆయన.. పౌరులెవరూ ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. ’మంకీపాక్స్ వంటి వ్యాధుల విషయంలో ప్రజలకు అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. ఇప్పటికే కేంద్రం తరఫున నీతి ఆయోగ్ సభ్యుడి నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశాం. టాస్క్‌ఫోర్స్ అధ్యయనం చేసిన తర్వాత వారి సలహాలు స్వీకరించి.. తర్వాతి చర్యలు తీసుకుంటాం. కేరళ ప్రభుత్వానికి కేంద్రం నుంచి ఎలాంటి సహాయం కావాల్సి వచ్చినా.. తప్పకుండా చేస్తాం. ఈ విషయంపై ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం మార్గదర్శనం చేస్తోందని మాండవీయ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు రావడం ప్రారంభమైనప్పటి నుంచే ముందుజాగ్రత్తలు మొదలుపెట్టామని అన్నారు.. కేరళలో తొలి కేసు రావడానికి ముందే మార్గదర్శకాలు విడుదల చేశాం. ప్రయాణికుల స్క్రీనింగ్ రిపోర్టులను సంబంధిత అధికారులకు పంపించాలని విదేశీ ప్రభుత్వాలను కోరాం. ఈ వ్యాధి కొత్తదేం కాదు. 1970ల నుంచి ఆఫ్రికాలో కేసులు నమోదవుతున్నాయి. డబ్ల్యూహెచ్‌ఓ దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించింది. దేశంలో కూడా పర్యవేక్షణ ప్రారంభమైంది. నిరంతర నిఘాతో వ్యాధిని అదుపులో ఉంచొచ్చని మాండవీయ పేర్కొన్నారు.
మంకీపాక్స్ కట్టడికి వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చేందుకు ఐసీఎంఆర్ సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. తొలిసారి వైరస్ స్టెయ్రిన్‌ను మంకీపాక్స్ నుంచి ఐసీఎంఆర్ వేరు చేసినట్లు చెప్పారు. దీన్ని వ్యాక్సిన్ తయారు చేసే సంస్థలకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, ఇందుకోసం ప్రతిపాదనలు సైతం పంపామని వివరించారు. మంకీపాక్స్ కొత్త వైరస్ ఏం కాదు. భారత్‌కు, ఈ ప్రపంచానికి అది కొత్తేం కాదు. దశాబ్దాల నుంచే ఆఫ్రికాలో ఉంది. కరోనా టైంలో ఎన్నో మంచి పాఠాలు నేర్చుకున్నాం. కాబట్టి, మంకీపాక్స్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. దేశంలో వరుసగా మంకీపాక్స్ కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. దిల్లీలో సోమవారం ఓ నైజీరియా వాసికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ఒక్క కేరళలోనే మొత్తం ఐదు కేసులు నమోదయ్యాయి. బుధవారం కేరళలో మరో కేసు వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మరోవైపు, దిల్లీలో మంకీపాక్స్ సోకిన తొలి వ్యక్తి కోలుకున్నాడు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్రం.. దేశంలో మంకీపాక్స్ కేసుల పర్యవేక్షణ, కట్టడి కోసం ప్రభుత్వానికి దిశానిర్దేశర చేసేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ ఈ టాస్క్‌ఫోర్స్‌కు నేతృత్వం వహిస్తారని అధికార వర్గాలు వెల్లడిరచాయి. ఇందులో కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులతోపాటు దేశంలోని ప్రధాన వైద్య, పరిశోధనా సంస్థల ప్రతినిధులూ సభ్యులుగా ఉంటారని తెలిపాయి. వైరస్ నిర్ధరణ, చికిత్సలకు సంబంధించి వసతుల విస్తరణ, అవసరమైన ఏర్పాట్లు, వ్యాక్సిన్ తయారీ తదితర అంశాలపై ఈ టాస్క్‌ఫోర్స్ సూచనలు చేస్తుంది. ’దేశంలో మంకీపాక్స్ కేసుల నిర్వహణలో ఈ టాస్క్‌ఫోర్స్ సహాయ పడుతుంది. ఆయా రాష్టాల్ల్రో నమోదయ్యే కేసులను సమన్వయం చేస్తుంది. అవసరమైతే సూచనలు జారీ చేస్తుంది’ అని ఓ సీనియర్ అధికారి తెలిపారు. అంతర్జాతీయ ప్రయాణికులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 1970 నుంచే ఆఫ్రికాలో మంకీపాక్స్ కేసులు
వెలుగు చూశాయి. ఈ ఏడాది మరో 75 దేశాల్లో వెలుగు చూసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వైరస్ విూద ప్రత్యేక దృష్టి సారించింది కూడా. వైరస్ బారిన పడ్డ వాళ్లకు ఐసోలేషన్ కోసం రెండు వారాల గడువు రికమండ్ చేసినట్లు పేర్కొన్న ఆయన.. వ్యాక్సిన్ తయారీ అంశం కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు.