మంగారి రాజేందర్‌తో సహా సర్వీస్ కమీషన్‌కు ఐదుగురు సభ్యుల నియామకం
హైదరాబాద్,అక్టోబర్10(జనంసాక్షి):
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో అదనపు సభ్యులను నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ప్రముఖ రచయిత, సెషన్స్ కోర్టు జడ్జి , జ్యూడిషరి అకాడమి డైరెక్టర్ మంగారి రాజేందర్‌తో సహా సభ్యులుగా టి.వివేక్, డి,కృష్ణారెడ్డి, రాంమోహన్‌రెడ్డి, ఎం.రాజేందర్, సి.హెచ్ విద్యాసాగర్‌రావు, సి.హెచ్.సాయిలను నియమించింది. దీంతోసభ్యుల సంఖ్య తొమ్మిదికి చేరింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ రాజ్‌భవన్‌లో అందించిన సభ్యుల జాబితాకు గవర్నర్ నరసింహన్ ఆమోద ముద్ర వేశారు. మరో ఆరుగురు సభ్యులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో టీఎస్‌పీఎస్సీలో మొత్తం సభ్యుల సంఖ్య 9కి చేరింది. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఆరుగురు సభ్యులను కొత్తగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు నియమించింది. కొత్తగా నియమితులైన సభ్యులలో మాజీ వాణిజ్యపన్నుల శాఖ ఉన్నతాధికారి తడికమళ్ల వివేక్, ఎమ్. రామ్హోహన్ రెడ్డి,సి.హెచ్. విద్యాసాగరరావు,డి. కృష్ణారెడ్డి, సి.హెచ్ సాయి లను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ జాబితాకు గవర్నర్ నరసింహన్ ఆమోద ముద్ర వేశారు.తెలంగాణ లో పలు ఉద్యోగాలకు నోటిపికేషన్లు వెలువడుతున్న నేపధ్యంలో ప్రభుత్వం వీరిని నియమించింది.