మంచినీటి ఎద్దడి లేకుండా చర్యలు

ఏలూరు,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి):  జిల్లాల్లో ఈ  వేసవిలో ఎక్కడా కూడా తాగునీటి ఇబ్బంది అనే మాట లేకుండా చర్యలకు ఉపక్రమించారు.  అవసరమైతే ప్రత్యేక మోటర్లు ద్వారా నీటిని చెరువుల్లోకి మళ్లించాలని ఆదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో తహశీల్దార్లు ప్రజల దాహార్తి తీర్చడానికి ప్రత్యేక చలివేంద్రాలు నెలకొల్పాలని కలెక్టర్‌ ఆదేశించారు. వేసవిలో సాధ్యమైనంత వరకు ప్రజలు సుదూర ప్రయాణాలను ఉదయం వేళల్లో, లేదా సాయంత్రం వేళల్లో మాత్రమే చేయాలి తప్ప మండు వేసవిలో ప్రయాణాలు చేయవద్దని సూచించారు. జిల్లాలో రబీ పంట చేతికొచ్చిన దృష్ట్యా రైతులకు పూర్తిస్థాయిలో గిట్టుబాటు ధర కల్పించడానికి కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి రైతుల నుండి ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు.  అగ్నిమాపక యంత్రాలు పూర్తి కండీషన్‌తో ఉంచాలన్నారు.