మంచినీటి కోసం మహిళల ఆందోళన
దమ్మపేట: మండలంలోని మందలపల్లి , ప్రకాశ్ నగర్ కాలనీలో మంచినీటి సమస్యపై మహిళలు రోడ్డెక్కారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయం ముందు ఖాళీబిందెలతో ఆందోళనకు దిగారు. కాలనీలో గత రెండు నెలలుగా మంచి నీటి సరఫరా సక్రమంగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరిస్తామని ఈవోఆర్డీ మహిళలకు హామీ ఇచ్చారు.