మంచినీటి సమస్యలకు ఇక చెక్‌

నిజామాబాద్‌,జూన్‌28(జ‌నం సాక్షి): ప్రభుత్వం గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రణాళికాబద్దంగా ముందుకు పోతోందని బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ అన్నారు. కేసీఆర్‌కు తెలంగాణపై ఉన్న పట్టుతో రానున్న కాలంలో అన్ని వర్గాలకు లబ్ధిచేకూరడం ఖాయమని అన్నారు. 60 ఏళ్ల వలస పాలనలో ప్రజలు కనీసం శుద్ధమైన తాగునీటికి నోచుకోలేదని, ప్రస్తుతం అమలవుతున్న మిషన్‌ భగీరథతో ఆ కల నెరవేరుతుందని అన్నారు. గ్రావిూణ ప్రాంతాల్లో శుద్ధమైన తాగునీరు, సాగునీరు, నాణ్యమైన కరెంటు, ఎండాకాలంలో చెరువులు నింపడమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. గిరిజన సంక్షేమమే లక్ష్యంగా ప్రతీ తండాకు రోడ్డు సౌకర్యం, మౌలిక వసతులను కల్పిస్తోందని కొనియాడారు. పేదవాని సంపాదనంతా వైద్యానికే ఖర్చవుతుందని, వారి అనారోగ్యానికి కలుషిత నీరే ప్రధాన కారణమని, వారి కోసమే ప్రభత్వం మిషన్‌ భగీరథ పథకాన్ని చేపట్టిందని ఎమ్మెల్యే అన్నారు.