మంచినీటి సమస్యలపై సర్పంచ్‌లకు సూచనలు

గ్రామాల్లో సమస్యలురాకుండా చర్యలు
జనగామ,ఫిబ్రవరి15(జ‌నంసాక్షి): కలెక్టర్‌ ఆదేశాలతో గ్రామాల్లో మంచినీటి సమస్యపై అధికారులు దృష్టి సారించారు. మిషన్‌ భగీరథ నీరు గ్రామాల్లోని ఇళ్లకు సరిపడా సరఫరా అవుతున్నాయని తెలిపారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు గ్రామాల్లో రిపేర్లు ఉన్న పాత ట్యాంకులను 14వ ఫైనాన్స్‌ నిధులతో రిపేరు చేసి శుభ్రం చేయడంతోపాటు రంగు లు వేయించాలని సూచించారు. ఈ క్రమంలో వేసవిలో బోర్లు వేయడం, ఫ్లెష్షింగ్‌ లాంటి సమస్యలు ఉత్ప న్నం కావన్నారు. ఇక ఉన్న నీటిని ప్ర ణాళికా బద్ధంగా సమపాళ్లలో అన్ని ఇళ్లకు సరఫరా అయ్యేలా గ్రామపంచాయతీలు నిర్వహణ బాధ్యతను తీసుకోవాలన్నారు. వచ్చే వేసవిలో నీటి ఎద్దడి రాకుండా ఆయా గ్రామాల సర్పంచ్‌లు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఇప్పటికే ఆదేవించారు. కొత్తగా పంచాయితీల్లో సర్పంచ్‌లు, పాలకవర్గాలు కొలవైనందున తొలుత మంచినీటి సమస్యలపై దృష్టి పెట్టాలని అన్నారు.  మరోవైపు అన్ని ట్యాంకులు శుభ్రం చేసి క్లోరినేషన్‌ చేసి ఉంచాలని కోరారు. ఇక మిషన్‌ భగీరథలో భాగంగా ప్రతి ఇంట్లోకి పోయే పైపుల ద్వారా సమపాళ్లలో నీరు అందేలా చూడాలన్నారు. గోదావరి నీరు సరఫరా వల్ల ట్యాంకులకు ఇసుక వచ్చే అవకాశం ఉందని, ఎప్పటికప్పుడు తీసివేయాలన్నారు. సర్పంచ్‌లు ఆయా గ్రామాల్లో నీటి సరఫరాపై ఎప్పటికప్పుడు మండలంలో ఉన్న ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులతో  సమన్వయంతో పనిచేసి నీటి ఎద్దడి లేకుండా చూడాల్సిర బాధ్యతను తీసుకోవాలన్నారు. ఇదిలావుంటే దేవరుప్పులగ్రామంలోని ప్రతీ కుటుంబానికి రూ. 2కే 20 లీటర్ల మినరల్‌ వాటర్‌ అందించనున్నట్లు సర్పంచ్‌ కూర్నాల రవి అన్నారు. కోలుకొండలో ఉన్న వాటర్‌ ప్లాంటుకు సర్పంచ్‌ తన సొంత ఖర్చులతో మరమ్మతులు చేయించి ఇటీవలే వినియోగంలోకి తెచ్చారు. శుద్ధి చేసిన తాగునీటిని కేవలం రూ. 2కే ప్రజలకు అందజేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. దోమలను నివారించేందుకు డ్రైనేజీలను శుభ్రం చేస్తూ ఫాగింగ్‌ చేస్తున్నట్లు వివరించారు.