మంచిర్యాలలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం
గరిమిళ్ల : బయ్యారం ఉక్కును సీమాంధ్రలోని విశాఖ ఉక్కు పరిశ్రమకు తరలించడాన్ని నిరసిస్తూ తెరాస రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంచిర్యాలలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్బంగా తెరాస నాయకులు మాట్లాడుతూ బయ్యారంలోనే ఉక్కు పరిశ్రమ నెలకొల్పి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు జగన్మోహనరావు, చిట్ల సత్యనారాయణ, బొజ్జ శరత్, పెద్దపల్లి మధు తదితరులు పాల్గొన్నారు.



