మంటపుట్టిస్తున్నమోర్కెల్..
వెల్లింగ్టన్ : ప్రపంచకప్ గ్రూప్ బీలో భాగంగా సౌతాఫ్రికా విసిరిన 342 పరుగుల టార్గెట్ ను చేరుకునే క్రమంలో యూఏఈ బ్యాట్స్మన్ తడబాటుక గురయ్యారు. 15 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయిన యూఏఈ 50 పరుగులు మాత్రమే చేయగలిగింది.
సఫారీ స్పీడ్ గన్ మోర్నీ మోర్కెల్ సూపర్ బౌలింగ్ దాటికి యూఏఈ బ్యాట్స్ మన్ ఒక్కొక్కరుగా పెవిలియన్ బాటపడుతున్నారు. 5 ఓవర్లు వేసిన మోర్కెల్ కేవలం 5 పరుగులిచ్చి కీలకమైన బెరెంజర్, ఖుర్రం ఖాన్ ల వికెట్లు పడగొట్టాడు. జేపీ డుమిని స్పిన్ మాయాజాలంతో ఒక వికెట్ తీశాడు.



