*మండల అభివృద్ధికి అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి పని చేయాలి.
చిట్యాల సెప్టెంబర్21 (జనంసాక్షి) మండల అభివృద్ధికి అధికారులు ప్రజా ప్రతినిధులు కలిసి పనిచేయాలని జెడ్పిటిసి గొర్రె సాగర్ అన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ వినోద అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జెడ్పిటిసి గొర్రెసాగర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయం, మిషన్ భగీరథ, ఉద్యానవనం, ప్రజారోగ్యం, అంగన్వాడి, ఈజీఎస్, రెవెన్యూ తదితర శాఖల ద్వారా మండలంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల ప్రగతిని సంబంధిత శాఖల అధికారులతో చర్చించారు. మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, మిషన్ భగీరథ, రెవెన్యూ సమస్యలపై సంబంధిత అధికారులను ప్రశ్నించారు. గ్రామాలలో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రాక ఇబ్బంది పడుతున్నామని, అర్షులైన లబ్ధిదారులకు పెన్షన్లు మంజూరు కాలేదని పలు గ్రామాల సర్పంచులు ,ఎంపీటీసీలు మండల సభలో అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం జడ్పిటిసి గొర్రె సాగర్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి అధికారులు సహకరించాలని గ్రామాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులు ప్రజాప్రతినిధులు కృషి చేయాలి అన్నారు. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో రైతులకు సంబంధించిన కరపత్రాన్ని ప్రజాప్రతినిధులు ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ఎంపీడీవో రామయ్య, తాసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి, పిఎస్సి ఎస్ చైర్మన్ కుంభం క్రాంతి కుమార్ రెడ్డి, వైస్ ఎంపీపీ నిమ్మగడ్డ రాంబాబు, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు కామిడీ రత్నాకర్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు జంబుల తిరుపతి, లతోపాటు పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.