మండల కేంద్రంలో డిజిల్‌,పెట్రోల్‌ ధరలను నిరసిస్తూ

ప్రధానమంత్రి దిష్టి బొమ్మదగ్దం

ధర్నా,రాస్తారోకో

జనంసాక్షి,వీణవంక :వీణవంక మండల కేంద్రంలో మండల కాంగ్రేస్‌ పార్టీ ఆధ్వర్యంలో వీణవంక జమ్మికుంట ప్రధాన రహదారిపై శనివారం పెంచిన డిజిల్‌,పెట్రోల్‌ ధరలను నిరసిస్తూ ప్రధానమంత్రి దిష్టబొమ్మను దగ్దంతో ధర్నా,రాస్తారోకో చేశారు.మండల కాంగ్రేస్‌ పార్టీ అధ్యక్షులు నల్లా కొండాల్‌ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై గత నాలుగు సంవత్సరాలుగా దేశ ప్రజలను నటేట్ట ముంచిన చరత్రలోనే నిలిచిన వ్యక్తిగా, పేద,బడుగు బలహిన వర్గాలుకు ఆర్థిక వ్యవస్థకు పూర్తి స్థాయి నడ్డి విరిచిన కేంద్ర ప్రభుత్వం రెండు సంవత్సరాల క్రితం నోట్ల మార్పిడి చేసిన ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రజలకు ఇబ్బంది పెడుతున్నారు.సరిపడా డబ్బులు బ్యాంకులలో ఇంత వరకు సమకూర్చలేదన్నారు.కాంగ్రేస్‌ నాయకులు ఎద్దేవా చేశారు.మద్దతు ధర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ్రాలు రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని రానున్న రోజులలో ఈ కేంద్ర ప్రభుత్వానికి ,రాష్ట్ర ప్రభుత్వానికి చరమ గీతం పాడుతారని అన్నారు.

ప్రభుత్వం రైతులకు మద్దతు ధర ఇవ్వడం లేదని ఆరోపించారు.కేంద్ర ప్రభుత్వం డిజిల్‌ ,పెట్రోల్‌ ,ధరలు నియంత్ర లేకుండా పెంచుతున్నారని వారన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌ లో డిజిల్‌,పెట్రోల్‌ ధరలు తగ్గినప్పటికి మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ధరలను నియంత్రించడం లేదని వారన్నారు.ఈ కార్యక్రమంలో కర్ర భగావాన్‌రెడ్డి,రాజిరెడ్డి, కొంరయ్య,సాయబ్‌హుస్సెన్‌,జనార్థన్‌రెడ్డి,కొంరయ్య,ఖాజామియాలతో తదితరులు పాల్గొన్నారు.