మండిపోతున ఎండ…జ్యూస్ స్టాళ్లకు జనం క్యూ

333సిటీలో ఎండలు మండిపోతున్నాయి. పగలు బయటకు రావాలంటనే జనం భయపడుతున్నారు. ఎండవేడి నుంచి  రిలీఫ్ కోసం జ్యూస్ స్టాళ్లకు క్యూ కడుతున్నారు. దీంతో జ్యూస్ వెండర్స్ కూడా… వెరైటీలతో… కష్టమర్స్ ని అట్రాక్ట్ చేస్తున్నారు.కర్ర బండ్ల జ్యూస్ సెంటర్లు సిటీలో ఇప్పుడు అట్రాక్షన్ గా మారాయి. వెరైటీగా తయారు చేశారు ఈ చెరుకు రసం బండిని. ప్యూర్ ఉడ్ తో తయారు చేసిన  ఈ చెరుకు బండికి కరెంట్ అక్కర్లేదు. కర్రను చుట్టూ తిప్పితే చాలు… చెరుకు రసం వస్తోంది. ఇలా కర్ర బండ్ల జ్యూస్ తో కూడా ఉపాధి పొందుతున్నారు. కర్ర బండి తిప్పుతూ చెరుకు రసం తీస్తున్న ఇతని పేరు హన్మంత్. మహబూబ్ నగర్ జిల్లా మంగనూర్.  బతుకు దెరువు కోసం హైదరాబాద్ విచ్చేసిన అతను మేస్త్రీగా కొంత కాలం పనిచేశాడు. షిర్డి  నుంచి 37 వేలకు కర్రబండి కొనుగోలు చేసి… చెరుకు రసం అమ్ముతూ ఉపాధి పొందుతున్నాడు.వెరైటీ కర్రబండి చెరుకు రసం తాగేందుకు జనం ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ప్యూర్ ఉడ్ ఆధారంగా తీసే చెరుకు రసం బాగుందంటున్నారు.