మంత్రిమేకపాటి మృతికి మంత్రలు దిగ్భార్రతి
యువ సహచరుడిని కోల్పోయామని సంతాపం
ఆయన మృతి ప్రభుత్వానికి,పార్టీకి తీరని లోటని వెల్లడి
అమరావతి,ఫిబ్రవరి21(జనంసాక్షి): మంత్రి గౌతమ్ రెడ్డి మృతి పట్ల మంత్రులు పలువురు నేతలు తీవ్ర దదిగ్భార్రతిని వ్యక్తం చేశారు. మృతికి మంత్రి పేర్నినాని సంతాపం వ్యక్తం చేశారు. గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో షాక్‌కు గురయ్యామన్నారు. మేకపాటి గౌతమ్ తనకు మంచి స్నేహితుడని.. ఆయన మరణం రాష్టాన్రికికి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటన్నారు. చిన్న వయసులో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా తన మార్క్ చూపించారన్నారు. ఆయన పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని కోరుతున్నానని.. వారి కుటుంబ సభ్యులకి తన ప్రగాఢ సానుభూతిని పేర్ని నాని తెలియజేశారు. గౌతమ్ రెడ్డి హఠాన్మరణం పట్ల రాష్ట్ర పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దిగ్భార్రతి వ్యక్తం చేశారు. చిన్న వయస్సులోనే గౌతమ్ రెడ్డి చాలా గొప్ప పేరు తెచ్చుకున్నారన్నారు. మంత్రిగా చాలా చురుగ్గా పని చేసి మంచి పేరు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. నిన్నటి వరకు రాష్టాన్రికి పెట్టుబడులు తెచ్చేందుకు కృషి చేశారన్నారు. గౌతమ్‌రెడ్డి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఓ మంచి స్నేహితుడ్ని, అన్నను కోల్పోయనని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ అనక్నారు. గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం పట్ల మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ దిగ్బాంత్రి వ్యక్తం చేశారు. ఓ మంచి స్నేహితుడు, అన్నను కోల్పోయానన్నారు. మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మరణ వార్త కలచివేసిందని మంత్రి తానేటి వనిత అన్నారు. మేకపాటి గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులకు ఆమె ప్రగాఢ సానుభూతి తెలిపారు. గౌతమ్‌రెడ్డి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని పార్థిస్తున్నాన్నారు. గౌతమ్‌రెడ్డి మృతి పట్ల డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ దిగ్భార్రతి వ్యక్తం చేశారు. ఏపీ అభివృద్ధి కోసం గౌతమ్‌రెడ్డి నిరంతరం శ్రమించార న్నారు. గౌతమ్‌రెడ్డి మృతి పట్ల మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యుడిలా గౌతమ్‌రెడ్డి ఉండేవారన్నారు. గౌతమ్‌రెడ్డి మరణం పార్టీ, ప్రజలకు తీరని లోటన్నారు. మంత్రి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం పట్ల మంత్రి బొత్స సత్యనారాయణ దిగ్భాంతి వ్యక్తం చేశారు.మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతిపై మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సంతాపం వ్యక్తం చేసారు. ఐటి రంగంలో అభివృద్ధి
చేసిన మేకపాటి గౌతంరెడ్డి మరణం బాధాకరమని మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు.. అభివృద్ధి చెందుతున్న ఏపీకి తీరని లోటు అవంతి పేర్కొన్నారు. సహచర మంత్రిగా స్నేహితునిగా ఆయన మరణం ఊహించుకోలేక పోతున్నామన్నారు. మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంపై నూజివీడు ఎమ్మెల్యే మేకాప్రతాప్ ప్రతాప్ అప్పారావు తీవ్ర దిగ్భాంª`రతి వ్యక్తం చేసారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాత్మరణంపై తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, ప్రభుత్వ హావిూల అమలు కమిటీ చైర్మన్ కొట్టు సత్యనారాయణ తీవ్ర దిగ్భార్రతి వ్యక్తం చేసారు. ఆయన అకాలమరణం పార్టీకి తీరని లోటు. ఒక సమర్థవంతమైన నాయకుడిని కోల్పోయామన్నారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం పట్ల ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని దిగ్భార్రతి వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే ఆయన మరణం చాలా బాధాకరమన్నారు. ఏపీలో పెట్టుబడుల కోసం పరిశ్రమలు, ఐటీ మంత్రిగా ఎంతో కృషి చేస్తున్నారన్నారు. నిన్నటి వరకు కూడా రాష్ట్రంలో పెట్టుబడుల కోసం దుబాయ్‌లో పర్యటించిన మేకపాటి గౌతమ్‌రెడ్డి ఇక లేరు అనే వార్త కలచి వేసిందన్నారు.మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి దిగ్భార్రతి వ్యక్తం చేశారు. గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ వారి కుటుంబ సభ్యులకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంత్రి గౌతమ్ రెడ్డి మృతి పట్ల తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం తెలిపారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి చాలా బాధాకరమన్నారు. గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అపోలో ఆస్పత్రికి వెళ్లి పారామర్శించారు.