మంత్రి అనుచరులకేనా బీసీ లోన్లు

 

 

 

 

 

;-పేద బీసీలను పట్టించుకోని మంత్రి గంగుల కమలాకర్
;-బీసీ లోన్లలో అక్రమార్కుల పై విచారణ జరిపించాలి

;-సిపిఐ కరీంనగర్ నియోజకవర్గ కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి,జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు

కరీంనగర్ నగరంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో బీసీ లోన్లలో అక్రమాలు,అవినీతి జరగడం సిగ్గుచేటైన చర్యాఅని వెంటనే ప్రజలకు బిసి మంత్రి సమాధానం చెప్పాలని కసిరెడ్డి సురేందర్ రెడ్డి పైడిపల్లి రాజు డిమాండ్ చేశారుకరీంనగర్ నియోజకవర్గంలో మంత్రి గంగుల కమలాకర్ తనకు ఇష్టం వచ్చిన వారికి బీసీ లోన్లు ఇచ్చి పేద బీసీలను మరీఛాడని ఇది సిగ్గుచేటైన చర్య అని ధ్వజమెత్తారు.బీసీ లోన్లలో జరిగిన అవినీతిపై ప్రభుత్వం విచారణ జరిపించాలని ఇంకా చాలా విషయాలు బయటకు వచ్చేఅవకాశం ఉందని వారు పేర్కొన్నారు.మంత్రి తన వెంబడి ఉండే తన అనుచరులకు సోషల్ మీడియాలో తనను ప్రచారం చేసే కార్యకర్తలకు ఇవ్వడం పట్ల ప్రజలు అసహించుకుంటున్నారని ఆరోపించారు.ప్రభుత్వ సొమ్మును తన సొంత డబ్బుగాఇవ్వడం సిగ్గుమాలిన చర్యని మంత్రికి అంత ప్రేమ ఉంటే తన వ్యక్తిగత డబ్బులు ఇవ్వాలని పేద ప్రజలు పన్నులు కట్టే డబ్బులతో లోన్లు ఇవ్వడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.మంత్రి ప్రత్యేక రుణాల కింద ప్రజాధనాన్ని తన సొంత డబ్బా కొట్టే వాళ్లకు ఇవ్వడం చూస్తుంటే మంత్రి ఎంతకు దిగజారాడు అనేది అర్థం అవుతుందని అన్నారు.
బీసీ లోన్లు అన్ని కూడా ఒక్క తన సొంత నియోజకవర్గం కి ఇవ్వడం చూస్తుంటే తనకు బీసీల పట్ల, జిల్లా లో ఉన్న బీసీలపట్ల ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుందన్నారు.బీసీ సంక్షేమ శాఖ అధికారులు ఇచ్చిన లోన్లపై సమాధానం ప్రజలకుచెప్పాలని వారు కోరారు.లోను తీసుకున్నవారు ఎక్కడ వారి వ్యాపారం నడుస్తుందో ఎక్కడ విసిట్ చేసి రుణము ఇచ్చారో బీసీ అధికారులు చెప్పాలన్నారు.పేదవాళ్లకు రుణం కావాలంటే ఆఫీస్ చుట్టూ కాలు చెప్పులు అరిగేలా తిరిగిన పేదలకు లోన్లు ఇవ్వని బీసీ సంక్షేమ శాఖ అధికారులు బిఆర్ఎస్ కార్యకర్తలకు ఎట్లా ఇచ్చారని ప్రశ్నించారు.అధికారులు బీసీ రుణాల అక్రమాలు, అవినీతిపై విచారణ జరిపించాలని లేనిపక్షంలో దీనిపై ఉన్నత స్థాయి అధికారులకు ఫిర్యాదు చేస్తామని, దీనికి బాధ్యులైన బీసీ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని కసిరెడ్డిసురేందర్ రెడ్డి, పైడిపల్లి రాజు డిమాండ్ చేశారు.

తాజావార్తలు