తాజావార్తలు
- సిద్ధరామయ్యే ఐదేళ్లు సీఎం
- శపథం చేసిన మావోయిస్టులు.. 23న భారత్ బంద్
- సీనియర్ మేట్లను అసిస్టెంట్లుగా గుర్తించాలని
- చెకుముకి పోటీల్లో జీనియస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
- ఎన్నారైలకు అండగా అడ్వైజరీ కమిటీ
- కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి
- నిఖత్ జరీన్‌కు స్వర్ణం
- కొలువుదీరిన నితీష్ సర్కారు
- త్వరలో భారత్‌కు అధునాతన జావెలిన్ క్షిపణి వ్యవస్థ
- భార్య, పిల్లల్ని హత్య కేసులో.. నిందితుడికి ఉరిశిక్ష
- మరిన్ని వార్తలు
రాజన్న సిరిసిల్ల బ్యూరో. మార్చ్ 3. (జనంసాక్షి). సిరిసిల్ల నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ చేసిన వాగ్దానాలు వైఫల్యాలపై హాత్ సే హత్ జొడో యాత్రలో భాగంగా సిరిసిల్లలో నిర్వహించే బహిరంగ సభ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి చార్జ్ షీట్ విడుదల చేస్తారని కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పష్టం చేశారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి పాదయాత్ర ఇంచార్జ్ సుభాష్ రెడ్డి, మాజీ మంత్రి సిరిసిల్ల రాజయ్య, కేకే మహేందర్ రెడ్డి లు మాట్లాడారు. మంత్రి కేటీఆర్ గవర్నర్ వ్యవస్థ పై మాట్లాడాన్ని సిరిసిల్ల రాజయ్య తప్పు పట్టారు. రాజ్యాంగం పట్ల కనీస అవగాహన లేకుండా మంత్రి కేటీఆర్ వ్యవహార శైలి ఉందని అన్నారు. రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునేందుకు ప్రజలు సిద్ధం కావాలని కోరారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ తో కలిసి నడవాలని కోరారు. కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో విద్వేషాలు రెచ్చగొడుతూ రాజకీయాలు చేస్తున్న బిజెపిని, రాష్ట్రంలో బిఆర్ఎస్ అవలంబిస్తున్న నిరంకుశత్వాన్ని ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం కోసం పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి చేపట్టిన హత్ సే హత్ జోడో పాదయాత్ర సిరిసిల్ల నియోజకవర్గం లో నేడు కొనసాగుతుందని అన్నారు. మిడ్ మానేరు తొమ్మిదవ ప్యాకేజీ పనులను పరిశీలించడంతోపాటు ప్రజల సమస్యలను తెలుసుకుంటారని తెలిపారు. అనంతరం సిరిసిల్ల పట్టణంలోని పద్మ నగర్ నుండి నేతన్న చౌరస్తా వరకు పాదయాత్ర కొనసాగుతుందని అన్నారు ఈ సందర్భంగా నిర్వహించే బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ సిరిసిల్ల ప్రజలకు ఇచ్చి అమలు చేయనీ వాగ్దానాలపై చార్జిషీట్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. సభను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు ప్రజలు భారీ సంఖ్యలో తరలిరావాల్సిందిగా పిలుపునిచ్చారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సంగీత శ్రీనివాస్, సూర దేవరాజు, కాముని వనిత మడుపు శ్రీదేవి., ఆకునూరి బాలరాజు, నాగుల సత్యనారాయణ గౌడ్ పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.



