మంత్రి కేటీఆర్ సమక్షంలో.. బీఆర్ఎస్లో చేరిన బీజేపీ కార్పొరేటర్
మంత్రి కేటీఆర్ సమక్షంలో.. బీఆర్ఎస్లో చేరిన బీజేపీ కార్పొరేటర్
బీఆర్‌ఎస్‌లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాకు ఆకర్షితులై పలు పార్టీల నాయకులు బీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరుతున్నారు. రోజురోజుకు ఈ చేరికలు ప్రభంజనంలా సాగుతున్నాయి. ఎమ్మెల్యేలు, మంత్రుల సమక్షంలో జిల్లాల్లో కాంగ్రెస్, బీజేపీల నాయకులు, కార్యకర్తలు గులాబీ తీర్థం పుచ్చుకుంటున్నారు.తాజాగా.. బీజేపీకి చెందిన కార్పొరేటర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రధాన అనుచరుడు బీఆర్ఎస్లో చేరారు. హైదరాబాద్, బాగ్ అంబర్ పేటకు చెందిన బీజేపీ కార్పొరేటర్ పద్మా వెంకట్ రెడ్డి బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో పద్మా వెంకట్ రెడ్డి దంపతులు, పలువురు బీజేపీ ముఖ్య నాయకులు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆధ్వర్యంలో ప్రగతి భవన్ వేదికగా గులాబీ దళంలో చేరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కాలేరు వెంకటేష్ విజయానికి తమ శాయశక్తులా పనిచేస్తామని పద్మా వెంకట్ రెడ్డి అన్నారు.