మంత్రి కొప్పుల సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు
జగిత్యాల జనం సాక్షి : సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసే బీఆర్‌ఎస్‌లోకి వలసలు కొనసాగుతున్నాయని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula) అన్నారు. జిల్లాలోని గొల్లపల్లి మండలం తిరుమలాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి 80 మంది కార్యకర్తలు, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కాంగ్రెస్ అలవి కానీ హామీలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నదని మండిపడ్డారు. ఎలాగూ గెలవలేమనే ధీమాతోనే సాధ్యం కానీ హామీలు ఇస్తున్నట్లుగా కనిపిస్తుందన్నారు. ఆ పార్టీ ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు నమ్మరని పేర్కొన్నారు. రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి పనులే పార్టీని గెలిపిస్తాయన్నారు. పార్టీలో చేరిన వారిలో బరిగెల తుక్కయ్య, ఆరెల్లి రవీందర్, నలువాల సురేష్, పబ్బ ప్రభాకర్, శ్రీనివాస్,
పబ్బ జీవన్, దండ్ల శ్రీనివాస్ జోగుల మహేష్, ఇమ్రాన్, రాజిరెడ్డి, జగడం రవీందర్, తదితరులు ఉన్నారు.